అమితాబ్ నోట అల్లు అర్జున్ మాట. బన్నీ గురించి బిగ్ బీ ఏమన్నారంటే..? '

First Published | Oct 19, 2024, 5:32 PM IST

పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ సాధించాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో నార్త్ లో ఆయన రేంజ్ మారిపోయింది. ఇక సామాన్యులే కాదు.. సెలబ్రిటీల నోటి వెంట కూడా అల్లు అర్జున్ మాట నాట్యం చేస్తోంది. 

Allu Arjun, Keshava, Pushpa,

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమా ముందు వరకూ ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే స్టార్ హీరోగా ఉన్నాడు బన్నీ. టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో కూడా మల్లు అర్జున్ గా స్టార్ డమ్ సాధించాడు ఐకాన్ స్టార్. ఈ స్టార్ డమ్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తం అయ్యింది. పుష్ప సినిమాతో బన్నీకి జాతీయ అవార్డ్ రావడం. అది కూడా ఇంత వరకూ టాలీవుడ్ హీరోలకు రాని.. బెస్ట్ హీరో కెటగిరీలో నేషనల్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా బన్నీ పేరు మారుమోగి పోయింది. 

పుష్ప సినిమాతో ఇంతటిస్టార్డమ్ రావడంతో.. పుష్ప సీక్వెల్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. అల్లు అర్జున్ కు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా డైహార్ట్ ఫ్యాన్స్ తయారయ్యారు. రీసెంట్ గా యూపీ నుంచి ఓ వీరాభిమాని దాదాపు 1600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి మరీ.. అల్లు అర్జున్ ను కలుసుకున్నాడు. 


బన్నీ కూడా అతని సాహసానికి మెచ్చి.. ఇంటికి పిలిపించుకుని మట్లాడి. యూపీకి ప్లైట్ బుక్ చేసి మరీ అతన్ని ఇంటికి పంపించాడు. ఆర్ధిక సహాయం కూడా చేశాడు. ఇలా ఉత్తరాదిన అల్లు అర్జున్ ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. పుష్ప2 కూడా సూపర్ హిట్ అయితే.. పాన్ఇండియా హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. ఇక మరో విషయం ఏంటంటే సామాన్యులే కాదు సెలబ్రిటీల నోట కూడా అల్లు అర్జున్ మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. 

రీసెంట్ గా బిగ్ బీ అమితాబచ్చన్ బన్నీని గుర్తు చేసుకున్నారు. అది కూడా కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో. ఈమధ్య ఈ ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ కు సబంధించిన ప్రశ్న కూడా వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరుఅని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. పవన్ గురించి ఈ ప్రోగ్రామ్ లో కాసేపు బిగ్ బీ మాట్లాడారు కూడా. ఇక తాజాగా ఇదే ప్రోగ్రామ్ లో అల్లు అర్జున్ కు సబంధించిన ప్రశ్న కూడా వచ్చింది. 
 

2023 గాను బెస్ట్ హీరో క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ అందు కున్న హీరో ఎవరు అని ప్రశ్న ఎదురయ్యింది. ఇలా బిగ్ బీ నోట బన్నీ మాట రావడంతో ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. పుష్ప 2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈసినిమా రిలీజ్ డేట్ మారేదిలే అంటూ రీసెంట్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. 
 

పుష్ప 2కు సబంధించిన పనులు శరవేగంగాి కంప్లీట్ అవుతున్నాయి. డిసెంబర్ 11న క్రిస్మస్ కానుకగా ఈసినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీమ్. ఈసినిమాతో ఆస్కార్ కు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటడమే లక్ష్యంగా మూవీ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి పుష్ప2 తో బన్నీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్  చేస్తాడో. 

Latest Videos

click me!