Samantha Bollywood Entry : నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత కెరీర్ లో దూకుడు... జెండా పాతడమే లక్ష్యం..!

Published : Jan 05, 2022, 08:29 PM ISTUpdated : Jan 05, 2022, 08:36 PM IST

ఒకపక్క టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్ పై దండెత్తున్నారు. ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా స్టార్ గా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ తొలి అడుగు వేశారు. అదే సమయంలో హీరోయిన్స్ రకుల్, రష్మిక బాలీవుడ్ లో పాగా వేసే పనిలో పడ్డారు.

PREV
17
Samantha Bollywood Entry : నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత కెరీర్ లో దూకుడు... జెండా పాతడమే లక్ష్యం..!
samantha

రకుల్ చేతిలో అరడజను బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ఇక రష్మిక (Rashmika Mandanna)మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలలో నటిస్తున్నారు. మరి వీరిద్దరి కంటే ముందే స్టార్ డమ్ సొంతం చేసుకున్న సమంత ఈ విషయంలో కొంచెం వెనుకబడ్డారు. గతంలో అవకాశాలు వచ్చినా ఎందుకో ధైర్యం చేయలేదు. అయితే విడాకుల తర్వాత ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లనిపిస్తుంది.

27


వరుసగా డిజిటల్ సిరీస్లు, పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్న సమంత (Samantha)అక్కడ స్టార్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా ఆల్రెడీ సమంత బాలీవుడ్ ప్రేక్ష క్షుల అటెన్షన్ రాబట్టారు. క్రిటిక్స్ సైతం సమంత నటనకు ఫిదా అయ్యారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సమంత పేరు ప్రముఖంగా వినిపించింది. 

37

ది ఫ్యామిలీ మాన్  సిరీస్ కి దర్శకులుగా ఉన్న రాజ్&డీకే లతో సిటాడెల్ సిరీస్ ప్రకటించింది సమంత. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్. సిటాడెల్ హిందీతో పాటు రీజనల్ భాషల్లో విడుదల కానుంది. కాగా ఆమె తరచుగా బాలీవుడ్ మీడియాకు టచ్ లో ఉంటున్నారు. అక్కడ మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

47

ఇది కూడా తన బాలీవుడ్ ప్లాన్స్ లో భాగమేనని అంచనా వేయవచ్చు. అలాగే బాలీవుడ్ స్టార్స్ తో కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు. దీపికా పదుకొనె బర్త్ డే కు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు సమంత. దీపికను మోస్ట్ గార్జియస్ ఉమెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అలా బాలీవుడ్ స్టార్స్ కి సమంత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.

57


లక్కీ హీరోయిన్ గా బ్రాండ్ నేమ్ ఉన్న సమంత అడుగుపెట్టిన ప్రతి చోట విజయం సాధించారు. అలాంటి ఆమెకు బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకోవడం మరీ అంత కష్టం కాకపోవచ్చు. దర్శకుడు గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం హిందీలో కూడా కూడా విడుదల కానుంది. అలాగే యశోద చిత్రం సైతం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. 

67

వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా సమంత బాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరేట్ హీరోయిన్ కావడం ఖాయం. ఈ లోపు ఆమె స్ట్రైట్ హిందీ చిత్రాలు కూడా ప్రకటించే ఆస్కారం లేకపోలేదు. నాగ చైతన్య (Naga Chaitanya)తో బ్రేకప్ కారణంగా డిప్రెషన్ కి లోనైన సమంత.. అతి కష్టం మీద సాధారణ స్థితికి చేరారు. కోలుకున్న సమంత కెరీర్ కోసం పరుగులు పెడుతున్నారు.

77

ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు గోవా వెళ్లారు. సెలెబ్రేషన్స్ ముగియడంతో ఆమె తిరిగి హైదరాబాద్ చేరినట్లు సమాచారం. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశలతో సమంత జీవితం మొదలుపెట్టారు. 

Also read Sai Pallavi: పెళ్లికి టైం ఫిక్స్ చేసిన సాయి పల్లవి..

Also read Naga Chaitanya: అల్ట్రా స్టైలిష్ లుక్ లో చిన బంగార్రాజు.. నాగ చైతన్య కోసం జనసంద్రంగా మారిన రాజమండ్రి

Read more Photos on
click me!

Recommended Stories