అమర్ దీప్ సినిమా కెరీర్
అమర్ దీప్ మాట్లాడుతూ.. "శైలజా రెడ్డి అల్లుడు" సినిమాలో నటించాను. కానీ ఎడిటింగ్ లో నా సీన్ తీసేశారు. ఆ సీన్ కు డబ్బింగ్ కూడా చెప్పాను, టైటిల్ లో పేరు ఉంది, కానీ సినిమాలో కనిపించను. మురళీ శర్మ గారితో కాంబినేషన్‌లో ఓ సీన్ చేశాను కాని అదీ కట్ అయ్యింది. దాంతో పాటు జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను, కానీ వాటిలో చాలా వాటిని చివరికి ఎడిటింగ్ లో తీసేశారని అమర్ దీప్ బాధపడ్డారు. "జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదటి అవకాశం మనోజ్ నంద సినిమాలో వచ్చింది. చాలాకష్టపడితే శాలరీగా 350 ఇచ్చినట్టు అమర్ దీప్ చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో తన మానసిక ఆరోగ్య సమస్యలు, కెరీర్ సవాళ్లు గురించి ఎంతో నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చాడు అమర్ దీప్. తన లవ్ స్టోరీతో పాటు, అమ్మ అంటే ఎంత ఇష్టమో వివరించాడు. హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని.. తాను దేవుడిలా కొలిచే వ్యక్తి తన నటన మెచ్చుకున్న సందర్భం మర్చిపోలేనిదన్నారు అమర్ దీప్. ప్రస్తుతం అమర్ దీప్ హీరోగా చేస్తున్న చిత్రం "నాయుడు గారి అమ్మాయి". ఈ సినిమా ద్వారా తన కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అమర్.