గర్భవతి అయ్యాక రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 14, 2025, 08:38 PM IST

హీరోయిన్ల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్ గా కెరీర్.. ఆతరువాత పర్సనల్ లైఫ్, పెళ్లి, అందరికి ఒకేలా ఉండదు. కొంత మంది ఈ విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే..మరికొందరు మాత్రం ఫ్యామిలీకి కట్టుబడి ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం తన లైఫ్ ను తానే డిజైన్ చేసుకుంది. ఏకంగా ప్రెగ్నంట్ అయిన తరువాత పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ. 

PREV
14
గర్భవతి అయ్యాక రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో వ్యక్తిగత జీవితాలు తరచూ వార్తలలో నిలుస్తుంటాయి. అయితే, కొందరు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను ఓపెన్‌గా పంచుకుంటారు. ఇటీవల, ప్రముఖ నటి అమలా పాల్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాజాగా జరిగిన జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటిగా (క్రిటిక్స్) అవార్డు గెలుచుకున్న అమలా పాల్, ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి, గర్భవతిగా పెళ్లి చేసుకోవడం వంటి విషయాలను శేర్ చేసుకున్నారు అమలా పాల్. 
 

24

అమలా పాల్  మాట్లాడుతూ, "నేను గోవాలో జగత్ దేశాయ్‌ను కలిశాను. అతడు గుజరాతీ అయినప్పటికీ గోవాలో సెటిల్ అయ్యాడు. నేను కేరళ నుండి వచ్చాను. అతడు దక్షిణాది సినిమాలు పెద్దగా చూడడు. నేను కూడా హీరోయిన్‌గా ఉన్నానని చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత, నేను గర్భవతిగా మారిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాతనే నేను హీరోయిన్‌ని అని అతనికి చెప్పాను. గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలను ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు." అని పేర్కొన్నారు.
 

34
Actress Amala Paul

అమలా పాల్ 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో పెళ్లి చేసుకున్నారు. కానీ, 2017లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత, 2023లో జగత్ దేశాయ్‌తో రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లకు ఓ కుమారుడు ఉన్నారు.

44

అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంత  ఓపెన్‌గా మాట్లాడడం ఆమెఫ్యాన్స్ తో పాటు అందరికి  ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా పరిశ్రమలో ఈ విధమైన వ్యక్తిగత విషయాలు శేర్ చేసుకోసం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇక ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటున్న అమలా పాల్ గతంలో టాలీవుడ్ లో నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'జెండాపై కపిరాజు', 'బెజవాడ' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. 

Read more Photos on
click me!

Recommended Stories