Rashmi gautam:కుర్రాళ్ల మధ్య నలిగిపోయిన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్... షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో చేదు అనుభవం

Published : Oct 26, 2021, 04:27 PM IST

ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన యాంకర్ రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కుర్రకారు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో, కాసేపటి తర్వాత సురక్షితంగా మాల్ లోకి వెళ్లారు. 

PREV
17
Rashmi gautam:కుర్రాళ్ల మధ్య నలిగిపోయిన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్... షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో చేదు అనుభవం

సెలెబ్రిటీలు తమ ప్రాంతానికి వస్తున్నారంటే జనాల్లో ఉండే ఆ క్రేజ్ వేరు. హీరోయిన్స్ తో పాటు రష్మీ లాంటి యాంకర్స్ ని చూడడానికి కుర్రకారు ఎగబడతారు. వాళ్ళను తాకడానికి, పక్కనే నిల్చొని సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారు. సరైన సెక్యూరిటీ లేకపోతే సదరు తారలకు చుక్కలు కనిపించడం ఖాయం. 

27

Anchor Rashmi gautam కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సోమవారం ఆమె చిత్తూరు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారు. తమ పట్టణానికి రష్మీ వస్తుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఆ షాప్ వద్దకు వందల సంఖ్యలో వచ్చి చేరారు. రష్మీని చూడాలని ఆశపడ్డారు.

37

రష్మీ అక్కడకు చేరుకోవడంతో యూత్ ఒక్కసారిగా ఆమె వైపు దూసుకెళ్లారు. రష్మీ చుట్టూ చేరి ఫోటోలు దిగడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. ఆ జనాల మధ్య రష్మీ చిక్కుకుపోయారు. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో రష్మీ సంయమనం పాటించారు.

47

అక్కడ యూత్ ఆమెను ఇబ్బంది పెడుతున్నా ఏవిధమైన కోపం చూపలేదు. అదే సమయంలో కొందరితో ఫోటో దిగే ప్రయత్నం చేశారు. రష్మీ ఇబ్బందిని గమనించిన నిర్వాహకులు హడావుడిగా ఆమెను షాప్ లోపలికి తీసుకెళ్లారు. దానితో రష్మీ ఊపిరి పీల్చుకున్నారు. 

57

షాప్ యాజమాన్యం పరిస్థితిని ముందుగా అంచనా వేయకపోవడంతో, తగు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. కనీస సెక్యూరిటీ లేని రష్మీ జనాల మధ్య ఇరుక్కోవడం జరిగింది. ఈ సంఘటనపై కొందరు షాప్ యాజమాన్యాన్ని తప్పుబడుతున్నారు. అంత పెద్ద సెలెబ్రిటీ వస్తుంటే కనీస జాగ్రత్తలు తీసుకోరా అంటూ.. ప్రశ్నిస్తున్నారు. 

67

తాజా సంఘటనతో రష్మీ పాపులారిటీ మరోమారు రుజువైంది. యూత్ లో ఆమెకున్న క్రేజ్ ఏమిటో తెలిసొచ్చింది. ఇక బుల్లితెర యాంకర్ గా Jabardasth, ఢీ వంటి మోస్ట్ వాంటెడ్ షోలలో కొనసాగుతున్న రష్మీ, పలు ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. 

77

మరోవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కావాల్సి ఉంది. నాగార్జున, Naga chaitanya మల్టీస్టారర్ బంగార్రాజు మూవీలో రష్మీ కీలక రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also read Namrata shirodkar: సర్కారు వారి పాట సెట్స్ లో నమ్రత సందడి... కీర్తి సురేష్ తో అలా!

Also read Samantha Naga Chaitanya Divorce: సమంత కఠిన నిర్ణయం వెనుక కారణం... అందుకే వెనక్కి తగ్గడం లేదా!

 

Read more Photos on
click me!

Recommended Stories