అల్లు స్నేహారెడ్డి గ్లామర్‌ ఫోటో షూట్‌ వెనుక ఇంత పెద్ద స్కెచ్‌ ఉందా?.. ఇలా అయితే హీరోయిన్లకి చుక్కలే..

Published : Jan 14, 2024, 10:08 PM ISTUpdated : Jan 14, 2024, 10:10 PM IST

అల్లు స్నేహారెడ్డి వరుసగా గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. కానీ దాని వెనకాల పెద్ద ప్లానే ఉంది.  అదేంటో బయటపడింది. ఇదిప్పుడు హీరోయిన్లని టెన్షన్‌ పెడుతుంది.   

PREV
16
అల్లు స్నేహారెడ్డి గ్లామర్‌ ఫోటో షూట్‌ వెనుక ఇంత పెద్ద స్కెచ్‌ ఉందా?.. ఇలా అయితే హీరోయిన్లకి చుక్కలే..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహా రెడ్డి ఇటీవల వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె హీరోయిన్ల రేంజ్‌లో ఫోటోలు దిగింది. గ్లామర సైడ్‌ కూడా ఓపెన్‌ అయ్యింది. ఇది చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ స్టార్‌ హీరో భార్య ఇలా చేయడం పట్ల చాలా వరకు పెదవి విరుపు లాంటి స్పందన వచ్చింది. ఇది కరెక్ట్ కాదనే కామెంట్లు వచ్చాయి. బన్నీ ఫ్యాన్స్ కూడా లోలోపల అసహనం వ్యక్తం చేశారు. కొందరు బహిరంగంగానే చెప్పార.

26
Allu Sneha Reddy

కానీ అవేవీ పట్టించుకోకుండా అల్లు స్నేహారెడ్డి తన ఫోటో షూట్లని కంటిన్యూ చేసింది. కొన్నిసార్లు మరింతగా హాట్‌ షో చేసి షాకిచ్చింది. ఇక అంతా అలవాటు పడటం స్టార్ట్ చేశారు. అదే సమయంలో స్నేహారెడ్డి హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తుందనే కామెంట్స్ వచ్చాయి. ఏదో పెద్ద ప్లానే వేస్తుందని అన్నారు. మొత్తానికి ఆమె సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానూ మారింది. 
 

36

అల్లు స్నేహారెడ్డి గ్లామర్‌ని, ఫిజిక్‌, స్టయిలీష్‌  లుక్‌ని చూసి హీరోయిన్లని మించిపోయిందని, హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ చాలా మంది భామలు అడ్రస్సులు గల్లంతే  అన్నారు. కానీ ఇప్పుడు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ట్విస్ట్,  షాక్‌లతో ఆశ్చర్యపరిచింది. అల్లు స్నేహారెడ్డి ఎట్టకేలకు టీవీల్లో మెరిసింది. నటిగానే మారింది. అయితే ఆమె టీవీ యాడ్‌ చేయడం విశేషం. 
 

46

ఇటీవలే అల్లు స్నేహారెడ్డి చేసిన యాడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో ఆమె ఓ చిన్న కుర్రాడితో కలిసి ఛాక్లెట్‌ యాడ్‌ చేసింది. కిండర్‌  షాక్‌ బార్న్  క్రిస్పీ ఛాక్లెట్‌ యాడ్‌ చేసింది. ఇందులో ఆమె హీరోయిన్‌ రేంజ్‌లో మెరిసింది. లుక్‌ వైజ్‌గా ఎంతో అందంగా ఉంది. క్యూట్‌గా, హట్‌గా మెప్పించింది. ఈ యాడ్‌ సైతం పాపులర్‌గా మారింది. 

56

మొత్తానికి అల్లు  స్నేహారెడ్డి గ్లామర్‌ ఫోటో షూట్‌ వెనకాల ఇంత పెద్ద స్కెచ్‌ ఉందా  అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.  అప్పుడు ఏదో అని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వాళ్లు  నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే బన్నీ హీరోగా భారీ పారితోషికం తీసుకుంటున్నారు. మరోవైపు యాడ్స్ చేస్తున్నారు. చిన్నా చితకా వ్యాపారాలున్నాయి. స్టూడియోస్‌ ఉన్నాయి. ఇలా చేతినిండా  సంపాదిస్తున్నాడు.  ఇప్పుడు ఆయన భార్య కూడా ఈ రంగంలోకి దిగడం విశేషం. 
 

66

యాడ్‌ అయినప్పటికీ ఓ రకంగా నటనలోకి దిగింది అల్లు స్నేహారెడ్డి. మరి అదే  పనిలో భాగంగా హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇస్తుందా? లేక నటిగా మారుతుందా ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.  ఇక మెగా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని బెంగుళూరులో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.  ఈ సంక్రాంతిని చాలా స్పెషల్‌గా మార్చుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories