అన్న అల్లు అర్జున్‌ `పుష్ప2`ని మించిన ప్రాజెక్ట్.. సైలెంట్‌గా తమ్ముడు అల్లు శిరీష్‌ ప్లాన్.. అసలు విషయం రివీల్

Published : Jul 31, 2024, 06:37 PM IST

అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్మురేపుతున్నారు. తమ్ముడు శిరీష్‌ సైతం అన్నని టార్గెట్‌ చేస్తున్నాడు. సైలెంట్‌గా ఏదో పెద్దదే ప్లాన్‌ చేస్తున్నాడట.   

PREV
15
అన్న అల్లు అర్జున్‌ `పుష్ప2`ని మించిన ప్రాజెక్ట్.. సైలెంట్‌గా తమ్ముడు అల్లు శిరీష్‌ ప్లాన్.. అసలు విషయం రివీల్

అల్లు శిరీష్‌ హీరోగా పరిచయమై పదేళ్లు దాటినా ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాడు. హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు బిగ్‌ బ్రేక్‌ ఇచ్చే సినిమాలు పడలేదు. స్టార్‌ ఇమేజ్‌ దక్కలేదు. అయితే ఆయన సినిమాలు కూడా చాలా సెలక్టీవ్‌గా చేస్తున్నాడు. ఏడాది, రెండేళ్లకి ఒక్క సినిమాతో వస్తున్నాడు. 

25

ఇదే ప్రశ్న అల్లు శిరీష్‌కి ఎదురైంది. ఇలా సెలక్టీవ్‌గా, స్లోగా సినిమాలు చేస్తున్నారు. కారణం ఏంటి? సినిమాలే చేస్తారా? ఇంకా ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి అల్లు శిరీష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని ఆయన లీక్‌ ఇచ్చాడు. ఇంకా ఏదో చేయబోతున్నట్టు వెల్లడించారు. హీరోగా చేయడంతోపాటు చాలా ప్లాన్స్ ఉన్నాయని తెలిపారు అల్లు శిరీష్‌.. అవన్నీ ఫ్రీగా చెబుతానని, చాలా విషయాలున్నాయని తెలిపారు. 
 

35

అదే సమయంలో అన్నయ్య అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్ములేపుతున్నాయి. మీరు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తారు? ఎలా ప్లాన్‌ చేస్తున్నారనే ప్రశ్నకి అల్లు శిరీష్‌ రియాక్ట్ అవుతూ. అలాంటిదే గట్టిగా ప్లాన్‌ చేస్తున్నానని వెల్లడించారు. పాన్‌ ఇండియా రేంజ్‌ ప్రాజెక్ట్ లు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఆ విషయాలు ఇప్పుడే చెప్పను, చేశాక, ఆ ప్రాజెక్ట్ పై నమ్మకం వచ్చాక చెబుతానని వెల్లడించారు శిరీష్‌. మొత్తంగా అన్న బన్నీ రేంజ్‌లో గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నట్టు ఆయన చెప్పకనే చెప్పేశాడు.
 

45

అల్లు శిరీష్‌ ఇప్పుడు `బడ్డీ` సినిమాలో నటించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీనికి శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా అల్లు శిరీష్‌ సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఇందులో తాను సెకండ్‌ లీడ్‌ అని, టెడ్డీ బేర్‌ హీరో అని తెలిపారు. చిన్నపిల్లలు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. 
 

55
Buddy

ఇటీవల పెరిగిన టికెట్‌ రేట్ల నేపథ్యంలో ఆడియెన్స్ థియేటర్ కి రావడం లేదు. ఎక్కువ మంది ఆడియెన్స్ ని థియేటర్ కి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో టికెట్‌ రేట్లు తగ్గించినట్టు తెలిపారు శిరీష్‌. ఈ నిర్ణయం ఒక ప్రయోగాత్మకంగా తీసుకున్నామని, ఇది వర్కౌట్‌ అయితే మున్ముందు కూడా ఫాలో అవుతామని, మిగిలిన నిర్మాతలు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుందన్నారు శిరీష్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories