మెగాస్టార్ చిరంజీవి 90వ దశకం ప్రథమార్థంలో అయితే బాక్సాఫీస్ వద్ద విజృంభణ చేసారు. కొండవీటి దొంగ, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన చిత్రాలన్నీ 90వ దశకం ఆరంభంలోనే పడ్డాయి. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.
అదే విధంగా చిరంజీవి నటించిన మరో అద్భుత చిత్రం కూడా 1990లోనే వచ్చింది. ఆ మూవీ ఏదో కాదు. చిరంజీవి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఆ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా ఉంటుంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అశ్విని దత్ నిర్మాత. ఈ చిత్రానికి కథ యండమూరి వీరేంద్రనాథ్ అందించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు ముందుగా చిరంజీవి హీరోగా ఫిక్స్ అయ్యారు. ఈ కథని అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ కోసం చూస్తున్నారు.
అప్పుడే రాఘవేంద్ర రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందు రాఘవేంద్ర రావు కి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో కొంతమంది ఆయనకై సందేహం వ్యక్తం చేశారట. వేరే డైరెక్టర్ ట్రై చేద్దాం అని చెప్పినవాళ్లు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి ససేమిరా అన్నారట.
ఫ్లాప్ డైరెక్టర్ ఎందుకు అని బయ్యర్లు కూడా కొంతమంది వద్దని చెప్పారట. కానీ చిరంజీవి.. రాఘవేంద్ర రావు అయితేనే నేను ఈ సినిమా చేస్తాను. లేకుంటే ఈ చిత్రంలో మీరు చిరంజీవిని మర్చిపోండి అని వార్నింగ్ ఇచ్చారట. దీనితో రాఘవేంద్ర రావు నే డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.
మూడు ఫ్లాపులు తర్వాత నాపై నాకే అనుమానం ఏర్పడింది. నేను ఇక పనికి వస్తానా అని అనుకునేవాడిని. ఆ టైం లో నాపై నమ్మకం ఉంచిన చిరంజీవికి, అశ్విని దత్ కి నేను రుణపడి ఉంటాను అని రాఘవేంద్ర రావు అన్నారు.