అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ సరైన బ్రేక్ కోసం చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఆయన సినిమాలు కొన్ని ఫర్వాలేదనిపించినా చాలా వరకు నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. సక్సెస్ కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం `బడ్డీ` అనే చిత్రంలో నటిస్తున్నాడు. టెడ్డీ బేర్ ప్రధానంగా సాగే థ్రిల్లర్ మూవీ ఇది. యాక్షన్, లవ్, రొమాన్స్, కామెడీ మేళవింపుగా తెరకెక్కించారు. శామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.