ఇక `గంగోత్రి` సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్, `ఆర్య`తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `బద్రీనాథ్`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు`, `రేసుగుర్రం`, `అల వైకుంఠపురములో`, `పుష్ప, `పుష్ప 2` చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం అట్లీతో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతుంది. అయితే బన్నీ నటించిన చిత్రాల్లో వాళ్ల అమ్మకి నచ్చిన మూవీ ఏంటంటే `పరుగు`. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం ఆమెకి బాగా ఇష్టమట. చాలా సార్లు ఈ మూవీని చూసిందట. ఇందులో బన్నీ నటన, యాటిట్యూడ్, సెటిల్డ్ గా నటించే తీరు బాగా నచ్చిందట. అంతేకాదు చిన్నప్పుడు డల్‌గా ఉన్న బన్నీ పెద్దయ్యాక అల్లరోడుగా మారిపోయాడట. ఈ సినిమాలో అలాంటి సీన్లే ఉంటాయి. సినిమాలో వాళ్ల అమ్మ ఇతనికి కాళ్లు నిలవవు, ఒక్కచోట ఉండడని చెప్పి గొలుసుతోనూ కట్టేస్తుంది. బహుశా అవి బన్నీ అమ్మకి బాగా నచ్చి ఉంటాయేమో.