Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 50 సినిమాల ప్రయాణంలో ఎదురైన అరుదైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నటుడు జగపతి బాబుతో ఉన్న విభేదాలు, ఆ తర్వాత ఏర్పడిన ఆత్మీయ అనుబంధం, 'దిల్' సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ పేరు వినగానే టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి, నేడు 50 సినిమాల మైలురాయిని చేరుకున్న అగ్ర నిర్మాత దిల్ రాజు తన సుదీర్ఘ ప్రయాణంలోని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
25
జగపతి బాబుతో చేదు అనుభవం:
దిల్ రాజు కెరీర్ ఆరంభంలో 'పెళ్లి పందిరి' సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న జగపతి బాబు, కొత్త డిస్ట్రిబ్యూటర్ అయిన రాజును చూసి "నువ్వు ఈ సినిమాను హ్యాండిల్ చేయగలవా?" అని అడిగారట. ఆ మాట రాజును కొంత బాధించినా, దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సినిమా విడుదలయ్యాక, నాంపల్లి ఎగ్జిబిషన్‌లో వినూత్నంగా ప్రమోషన్లు చేయడమే కాకుండా, సినిమాను సక్సెస్ చేయడంలో రాజు చూపించిన ప్యాషన్ చూసి జగపతి బాబు ఆశ్చర్యపోయారు. ఇటీవల ఒక వేదికపై జగపతి బాబు ఆనాటి సంఘటనకు దిల్ రాజుకు సారీ కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
35
రూపాయి తీసుకోకుండా నటించిన జగపతి బాబు
జగపతి బాబుతో ఉన్న అనుబంధం ఎంత బలపడిందంటే, 'ఆకాశమంత' సినిమా తెలుగు వెర్షన్ కోసం ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. "ఒక మంచి సినిమాలో భాగమైతే చాలు రాజు, నాకు డబ్బు వద్దు" అని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో కదిలించాయని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. అలాగే 'పిల్ల నువ్వు లేని జీవితం' సినిమాలో శ్రీహరి మరణం తర్వాత ఆ పాత్రను చేయడానికి జగపతి బాబు వెంటనే అంగీకరించారు.
దిల్ రాజుకు నిర్మాతగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా 'దిల్'. అప్పటికే 'ఆది' వంటి భారీ హిట్‌తో ఉన్న దర్శకుడు వి.వి. వినాయక్ ఈ సినిమాకు నితిన్ అయితే బాగుంటుందని సూచించారు. నితిన్ నటించిన మొదటి సినిమా 'జయం' విడుదల కాకముందే ఆయనను ఈ సినిమాకు ఎంపిక చేసుకోవడం విశేషం.
55
జీరో నుంచి అగ్ర నిర్మాతగా..
జీరో నుంచి ప్రారంభించి అగ్ర నిర్మాతగా ఎదగడం అనేది ఒక గొప్ప అనుభూతి అని దిల్ రాజు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో డబ్బు కంటే మనుషులను సంపాదించుకోవడం, బలమైన సంబంధాలను నిర్మించుకోవడమే నిజమైన విజయమని ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా చాటిచెప్పారు.