అల్లు అరవింద్‌ వర్సెస్‌ దిల్‌రాజు.. డబ్బింగ్‌ సినిమాల కోసం పోటీ పడుతున్న బడా ప్రొడ్యూసర్స్

First Published Sep 17, 2022, 8:29 AM IST

టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్స్ గా రాణిస్తున్నారు అల్లు అరవింద్‌, దిల్‌రాజు. టాలీవుడ్‌ `ఆ నలుగురి`లో వీరిద్దరు కూడా ఉన్నారు. తాజాగా ఈఇద్దరు డబ్బింగ్‌ సినిమాల కోసం పోటీ పడుతుండటం విశేషం. 
 

మెగా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు అల్లు అరవింద్‌. బలమైన కథలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకునే అల్లు అరవింద్‌ టాప్‌ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. అయితే ఇటీవల ఆయన బ్యానర్‌ నుంచి వస్తోన్న సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఆచితూచి సినిమాలు నిర్మించేపనిలో పడ్డారు అల్లు అరవింద్. 

దిల్‌రాజు టాప్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఆయన చేతిలో పలు పాన్‌ ఇండియా సినిమాలున్నాయి. విజయ్‌, రామ్‌చరణ్‌ మూవీస్‌ ఉన్నాయి. వీటితోపాటు మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అత్యధికంగా సినిమాలునిర్మిస్తూ నెంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. 

త్వరలో వీరిద్దరు బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నారు. థియేటర్ల కోసం ఫైట్‌ చేస్తున్నారు. అయితే వారు నిర్మించే చిత్రాల కోసం కాదు, డబ్బింగ్‌ సినిమాల కోసం ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొనడం విశేషం. అల్లు అరవింద్‌ ధనుష్‌ నటించిన `నేనే వస్తున్నా` చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. దిల్‌రాజు `పొన్నియిన్‌ సెల్వన్‌ 1`ని విడుదల చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‌లో విడుదల కాబోతున్నాయి. 

మణిరత్నం దర్శకత్వంలో కార్తి, విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన చిత్రం `పొన్నియిన్‌ సెల్వన్‌`.ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఆధారంగా ఛోళరాజుల కాలం నాటి కథతో పీరియడ్‌ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుస పరాజయాలతో ఉన్న మణిరత్నం తానేంటో నిరూపించుకోబోతున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న విడుదల కాబోతుంది. దీన్ని దిల్‌ రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. 
 

మరోవైపు ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడుతుంది.పైగా ఇప్పుడు ఆయన తెలుగు సినిమాలు చేస్తున్నారు. దీంతో ఆయన నుంచి వచ్చే చిత్రాలకు అంతే క్రేజ్‌ ఉంటుంది.ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన `నేనే వస్తున్నా` చిత్రాన్ని అల్లు అరవింద్‌ తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది.ఇందులో ధనుష్‌ రెండు పాత్రల్లో కనిపించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. `పీఎస్‌ 1`కి ఒక్క రోజు ముందు ఈ సినిమా విడుదలవుతుంది. 
 

ఈ రెండూ డబ్బింగ్ సినిమాలే కావడం గమనార్హం. ఒక్క రోజు గ్యాప్‌తో విడుదల కాబోతున్నాయి. అయితే తెలుగులో ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు విడుదల చేస్తుండటంతో ఇద్దరూ ఎవరికి వారు తమ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో థియేటర్ల విషయంలో పోటీ నెలకొందని తెలుస్తుంది. మరి ఈ పోటీలో విజయంఎవరిదనేది ఆసక్తిగా మారింది. 
 

click me!