మీరే నాకు ఆచార్య.. చిరుకి బన్నీ స్పెషల్‌ బర్త్ డే విశెష్‌

First Published | Aug 22, 2020, 9:58 AM IST

మెగాస్టార్‌ బర్త్‌ డేని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ విశెష్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవికి సోషల్‌ మీడియాలో ద్వారా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. అందరి కంటే ముందుగా దర్శకేంద్రడు కె.రాఘవేంద్రరావు చిరుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పంచుకున్నారు. తాజాగా స్టయిలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ విశెష్‌ తెలిపారు. 

ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు మా ఒకే ఒక మెగాస్టార్ కి. నా హృదయం ఎల్లప్పుడు ఆయనపై గౌరవం, ప్రేమ, కృతజ్ఞతా భావంతో నిండిపోయిఉంటుంది. చాలా విషయాల్లో నా నిజమైన ఆచార్య చిరంజీవిగారే` అని చెబుతూ, హ్యాపీ బర్త్ డే చిరంజీవి అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకున్నారు.
తాజాగా ఆయన చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇది `శంకర్‌ దాదా జిందాబాద్‌` చితంలోని స్టిల్‌. ఈ స్టిల్‌ బాగా ఆకట్టుకుంటుంది.

నిజానికి అల్లు అర్జున్‌ కెరీర్‌ ప్రారంభమైందే చిరంజీవి సినిమాతో. చిరు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన `విజేత` సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకుపరిచయం అయ్యాడు బన్నీ.
బన్నీ హీరోగా కావాలనుకోవడానికి చిరంజీవినే స్ఫూర్తి అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్నే బన్నీ చాలా సందర్భాల్లో తెలిపారు.
`డాడీ` చిత్రంలోనూ గెస్ట్గ్ గా మెరిశారు బన్నీ. ఇందులో డాన్సర్‌గా కనిపించి అలరించింది. సురేష్‌ క్రిష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా, సిమ్రాన్‌ ఇందులో హీరోయిన్‌. ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు.
దీంతోపాటు హీరో అయిన తర్వాత ఒకే ఒక్క సినిమాలో గెస్ట్ గా మెరిశారు. అదే `శంకర్‌ దాదా జిందాబాద్‌`. ఇందులో చివర్లో వచ్చే మాస్‌ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డాన్సులువేశారు. ఈ సాంగ్‌ విశేషంగా అలరించింది. ఫ్యాన్స్ కి కనువిందులా నిలిచింది.
చిన్నప్పుడు అల్లు అర్జున్‌కి చిరు డాన్సులు కూడా నేర్పించాడు. తనయుడు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, శిరీష్‌, సాయితేజ్‌ ఇలా పిల్లలందరికి దగ్గరుండి డాన్స్ లోని మెలకువలునేర్పించారు.
అంతేకాదు చాలా విషయాలో చిరంజీవి తనకు గురువులాంటి వారని బన్నీ చెబుతుంటారు. నటన పరంగా, డాన్సులు, వ్యక్తిత్వం ఇలా అనేక విషయాల్లో తనకు మెగాస్టార్‌ ఆచార్య లాంటివారని అల్లు అర్జున్‌ తాజా ట్వీట్‌లోనూ పేర్కొన్నారు.

Latest Videos

click me!