బొమ్మాలికీ తప్పని కాస్టింగ్‌ కౌచ్‌.. ఎలా తప్పించుకుందో చెప్పిన స్వీటీ అనుష్క

సినీ రంగంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. ఇప్పటికే చాలా మంది తారలు ఈ అంశం మీద బహిరంగంగా గళం విప్పుతున్నారు. మరికొందరు, తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. గతంలో స్వీటీ అనుష్క కూడా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందించింది. తానకు కూడా ఇండస్ట్రీలో వేదింపులు ఎదురయ్యాయని చెప్పింది.

Casting couch, an open secret: Anushka Shetty reveals how she escaped from it
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్‌ ఉందన్న విషయం అందరికీ తెలిసిన సీక్రెట్ అని కామెంట్ చేసింది టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి.
Casting couch, an open secret: Anushka Shetty reveals how she escaped from it
ఓ పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్‌ అనేది చాలా కామన్‌ అని, టాలీవుడ్ లో కూడా అది ఉందని చెప్పింది అనుష్క.

అయితే తనకు అలాంటి అనుభవాలు ఎదురైనా తన ధైర్యం, ముక్కుసూటితనం కారణంగా తప్పించుకోగలిగానని చెప్పింది.
తాను ముఖం మీద మాట్లాడుతాను కాబట్టే ఎవరు తన దగ్గర పిచ్చి వేశాలు వేయలేదని చెప్పింది.
ఇటీవల నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కూడా అనుష్క, కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. టాలీవుడ్‌ కొత్తగా వచ్చే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయిని అభిప్రాయ పడింది అనుష్క.
తాను వ్యక్తిగతం ఎంతో స్ట్రిక్ట్‌గా ఉంటానని, అదే సమయంలో తన ధృడమైన వ్యక్తిత్వం కారణంగానే తన జోలికి ఎవరు రాలేదని చెప్పింది.
ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి లొంగకుండా ఎక్కవు కాలం ఉండేందుకు చాాలా కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నానని తన సినీ ప్రయాణం గురించి చెప్పింది అనుష్క శెట్టి.

Latest Videos

vuukle one pixel image
click me!