అయితే త్రిక్రమ్, బన్నీ మూవీ ఇప్పటి వరకు తెలుగులో రాని సబ్జెక్ట్ అని నిర్మాత నాగవంశీ తెలిపారు. భారీ స్థాయిలో ఉండబోతుందని, ఎవరూ ఊహించని విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే ఈ మూవీ కథేంటో బయటకు వచ్చింది.
శివుడి తనయుడు, యుద్ధ దేవుడిగా పిలవబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తండ్రి అయిన మహా శివుడిని తిరిగి కలవడానికి బయలు దేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించే ప్లాన్‌లో ఉన్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.