బాలయ్యకి పద్మభూషణ్.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ అదిరిపోయిందిగా 

Published : Jan 27, 2025, 01:09 PM ISTUpdated : Jan 27, 2025, 01:13 PM IST

నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలని గుర్తించిన భారత ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకి బాలయ్యని ఎంపిక చేసింది.

PREV
14
బాలయ్యకి పద్మభూషణ్.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ అదిరిపోయిందిగా 

నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలని గుర్తించిన భారత ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకి బాలయ్యని ఎంపిక చేసింది. దేశంలో మూడో అత్యుత్తమ అవార్డు ఇది. 

24

బాలయ్యకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినిమాకి అందించిన సేవలకు మీరు ఈ అవార్డుకి అన్ని విధాలా అర్హులు అని అల్లు అర్జున్ బాలయ్యని ప్రశంసించారు. 

34

అదే విధంగా పద్మభూషణ్ అందుకుంటున్న అజిత్ కుమార్ కి కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ నాగ్, శోభన, శేఖర్ కపూర్ లు కూడా పద్మ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. వారికి కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. 

 

44

అల్లు అర్జున్, బాలకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి చెందిన ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories