హైదరాబాద్ లో రెస్టారెంట్లు నడుపుతున్న తెలుగు హీరోలు , మొదలుపెట్టింది ఎవరో తెలుసా?

Published : Aug 28, 2025, 12:18 PM IST

స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తో బిజినెస్ లు చేస్తూ.. అంతకు మించి సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. అందులో రెస్టారెంట్ బిజినెస్ కూడా ఒకటి. హైదరాబాద్ లో రెస్టారెంట్లు నడిపిస్తున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

PREV
16

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంత మంది అయితే వందల కోట్లు తీసుకుంటున్నారు. ఆ డబ్బును వ్యాపారంలో పెట్టి మరింతగా సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫుడ్ బిజినస్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు టాలీవుడ్ హీరోలు. వెండితెరపై తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించడమే కాదు, వ్యాపార రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టి, తమ స్టైలిష్ బ్రాండ్లతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

26

స్టార్ హీరోలు నటనకు పరిమితం కాకుండా.. నోరూరించే రకరకాల ఆహార సంస్థలతో నగరంలోని కీలక ప్రాంతాల్లో తమదైన మార్కును వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను మొదటిగా ఆరంభించిన వారిలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ముందంజలో ఉన్నారు. ఆయన ప్రారంభించిన ‘ఎన్ గ్రిల్’ , ‘ఎన్ ఏషియన్’ రెస్టారెంట్లు బంజారాహిల్స్‌లో నెంబర్ బన్ బ్రాండ్లుగా నిలిచాయి. క్లాస్ , క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్‌ మెనూ అందించడంలో ఈ రెస్టారెంట్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

36

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఏఎన్ రెస్టారెంట్స్’ పేరుతో హైదరాబాద్ ఫుడ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన ‘బఫెలో వైల్డ్ వింగ్స్’ అనే స్పోర్ట్స్ బార్‌ను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించి యువతను ఆకర్షిస్తున్నారు. ఈ రెంస్టారెంట్లకు యూత్ పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతే కాదు ఎక్కువగా ధనవంతులు ఈ రెస్టారెంట్లను విజిట్ చేస్తుంటారు.

46

యంగ్ హీరోల్లో దగ్గుబాటి రానా కూడా హైదారాబాద్ లో రెండు బ్రాండ్‌లను నిర్వహిస్తున్నారు. ఒకటి ‘బ్రాడ్‌వే’ అనే లైఫ్‌స్టైల్ హబ్ కాగా, మరొకటి ‘సాంక్చువరీ’ రెస్టారెంట్. ఈ రెండో రెస్టారెంట్ రానా తన పాత ఇంటిని మార్చి రూపొందించినది. మల్టీక్యుజిన్ కాన్సెప్ట్‌తో ఈ రెస్టారెంట్లు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తున్నాయి.

56

మరో వైపు నాగచైతన్య ప్రారంభించిన ‘షోయు’ అనే పాన్-ఏషియన్ రెస్టారెంట్, అలాగే ‘స్కుజి’ అనే యూరోపియన్ క్యూజిన్ స్పాట్ కూడా ఫుడ్ లవర్స్‌లో మంచి పేరు సంపాదిస్తున్నాయి. సంప్రదాయ తెలుగు రుచులను ప్రోత్సహిస్తూ నటుడు సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్‌ను విజయవంతంగా నడుపుతున్నారు.

66

ఇక టాలీవుడ్ యంగ్ హీరో, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ‘గుడ్ వైబ్స్ ఓన్లీ క్యాఫే’ ద్వారా మిలీనియల్స్‌ను ఆకర్షించగా, శర్వానంద్ ‘బీన్జ్’ అనే స్నాక్స్ సెంటర్‌తో మార్కెట్లోకి వచ్చారు. నటుడు శశాంక్ 'మాయాబజార్' అనే థీమ్ రెస్టారెంట్‌తో క్లాసిక్ టచ్‌తో కూడిన డైనింగ్ అనుభూతిని అందిస్తున్నారు.ఈ విధంగా, టాలీవుడ్ హీరోలు తమ పాపులారిటీని ఉపయోగించి రెస్టారెంట్ రంగంలోకి విజయవంతంగా అడుగుపెట్టి, హైదరాబాద్‌ను ఫుడ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగస్వాములవుతున్నారు. నటులు మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా వారు రాణిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories