అరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలు, వెండి కుర్చీపై వినాయకుడు.. ఈ గణపతికి 450 కోట్ల రూపాయలకు బీమా

Published : Aug 28, 2025, 11:32 AM IST

గణేష్ ఉత్సవాలు భారతదేశంలో జోరుగా సాగుతున్నాయి. వినాయక మండపాలను నిర్మించి ప్రతి వీధిలోను గణేశుడిని పూజిస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం ఏకంగా బంగారంతోనే గణేశుడిని అలంకరించారు. మన దేశంలో అతి ఖరీదైన గణపతి ఈయనే. 

PREV
15
ఇండియాలో వినాయక చవితి

వినాయక చవితి వచ్చిందంటే భారతదేశంలో వీధి వీధిన వినాయక మండపాలు కనిపిస్తాయి. మారుమూల పల్లెల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో గణేష్ ఉత్సవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ ప్రతి మూలలోనూ గణేష్ మండపాలు కనిపిస్తాయి. కాగా ముంబైలో ఇప్పుడు అతి ఖరీదైన గణేషుడిని ఏర్పాటు చేశారు. వెండి, బంగారంతో ఆ వినాయకుడిని అలంకరించారు. అందుకే ఆ గణేశుడికి ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా బీమా చేయాల్సి వచ్చింది.

25
ముంబైలో ఎక్కడ?

ముంబైలోని మాతుంగ అనే ప్రాంతంలో కింగ్స్ సర్కిల్లో ఉన్న జిఎస్‌బి సేవా మండల్ ఈ ఖరీదైన గణపతిని ఏర్పాటు చేశారు. ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేయించడానికి చాలా ఖర్చు పెట్టారు. దేశంలోనే అత్యంత ధనిక గణపతిగా ఇప్పుడు ఈ వినాయకుడు పేరు పొందాడు. ఈ వినాయకుడిని 67 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలాగే గణపతి కూర్చున్న వెండి సింహాసనాన్ని 350 కిలోల వెండితో తయారు చేయించారు.

35
అందరికీ ప్రమాద బీమా

ఈ వినాయకుడికి చేసిన బీమాలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఆ మండపాన్ని ఏర్పాటు చేసిన వాలంటీర్లు, పూజారులు, వంట వారు, గార్డులు అందరికీ ప్రమాద బీమాను చేయించారు. ఏదైనా విపత్తు కలిగితే నష్టాన్ని భరించే విధంగా బీమాలు ఉన్నాయి. ఈ బీమాను ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చేసింది.

45
ప్రత్యేక మట్టితో తయారీ

ఈ గణేశా మండపంలోని వినాయకుడిని షాడు అనే మట్టితో తయారు చేయించారు. ఈ మట్టి ఎంతో ప్రత్యేకమైనది. పర్యావరణ అనుకూలమైనది. అలాగే ఈ వినాయకుడిని తయారు చేయడానికి సహజమైన రంగులను మాత్రమే వినియోగిస్తారు. ఈ వినాయకుడిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. బంగారంతో ధగధగలాడుతూ కనులకింపుగా కనిపిస్తారు.

55
కొబ్బరికాయల ప్రసాదం

ముంబైలోని మాతుంగా గణపతి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ గణపతిని చూసేందుకు దూర తీరాల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ గణపతి విగ్రహాన్ని ఒక్కసారి దర్శిస్తేనే కోరిన కోర్కెలను నెరవేరుతాయి అని నమ్ముతారు. ఇక్కడ పది రోజులు పాటు గణేష్ ఉత్సవాన్ని అందరి వైభవంగా జరుపుతారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం భక్తులకు ఇచ్చే కొబ్బరికాయ ప్రసాదం కోసం వందల మంది భక్తులు క్యూ లైన్ లలో నిల్చుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories