‘పుష్ప 2’:US డీల్ అన్ని కోట్లా,షాక్ అవుతున్న ట్రేడ్

First Published | Oct 16, 2024, 4:23 PM IST

 పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


  
సినీ ప్రేమికులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa) అన్న విషయంలో సందేహం లేదు.  ఆగస్టు 15న రిలీజ్‌ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న (Pushpa Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆగస్ట్ 15 వంటి డేట్ మిస్సవటం టీమ్ అందరికీ బాధగా ఉంది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రం విడుదల వాయిదా పడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు.

ఎలాగో వాయిదా పడింది. లాస్ట్ మినిట్ టెన్షన్ లు లేకుండా ఫ్రీగా రిలాక్స్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ డీల్ ఇప్పుడు అంతటా  చర్చగా మారింది. ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాకు అంత రేటుకు అమ్ముడుపోలేదని అంటున్నారు. అసలెంత రేటుకు US డీల్ జరగనుందో చూద్దాం.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


తెలుగు పరిశ్రమలో మోస్ట్ రెస్పెక్టబుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. దర్శకుడుగా రాజమౌళి తర్వాత ఆ రేంజి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు ఆయనే  . తను తీసే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, అదే సమయంలో కమర్షియల్ విలువలుని సినిమాలో మేళవిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు.

రాజమౌళిలా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా ఎపిక్ మూవీస్ తీయకపోయినా.. సుకుమార్‌కు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటానికి అదే కారణం. కథల్లో, టేకింగ్‌లో ఆయన చూపించే వైవిధ్యమే ముఖ్య కారణం. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు 


allu arjun sukumar fahadh faasil

 
అలాగే  పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   అయితేనేం అవుట్ ఫుట్ అదిరిపోతుంది. అదే కదా ప్రేక్షకులకు కావాల్సింది. 
 

 తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం.  పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.

ఈ క్రమంలో US డీల్  నిమిత్తం $15 మిలియన్ గా నిర్మాతలు అడుగుతున్నట్లు సమాచారం. బేరసారాలు, నెగోషియేషన్స్ భారీగా జరుగుతాయంటున్నారు. $15 million అంటే 125 కోట్లు. అంత రికవరీ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలి. బ్రేక్ ఈవెన్ ఎంత ఉంటుందనే చర్చ ట్రేడ్ లో జరుగుతోంది. 

Pushpa 2

 
ఇక నిర్మాతలు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా  మంచి క్వాలిటీతో చిత్రాన్ని మీకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.  అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ .  ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  

Latest Videos

click me!