Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే

Published : Mar 03, 2026, 05:14 PM IST

Allu Arjun: సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోన్న స‌మ‌యంలో చిన్న చిన్న ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే పొర‌పాటున న‌టుల మ‌ధ్య కొన్ని సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కూడా అలాంటి ఓ ఇబ్బందిక‌ర సంఘ‌ట‌న ఎదురైంది. 

PREV
14
సెట్‌లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ న‌వ్వుతూ, న‌వ్విస్తుంటారు. ఆయ‌న గురించి వ‌చ్చే మొద‌టి ఆలోచ‌న కూడా ఇదే. అడ‌పాద‌డ‌పా ఈవెంట్స్‌లో కాస్త సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తారు కానీ ఎప్పుడూ జోవియ‌ల్‌గానే ఉంటారు. అయితే ఇలాంటి బ‌న్నీ ఓ సీనియ‌ర్ నటుడిపై చేయి చేసుకున్నారంటే న‌మ్ముతారా.? కానీ ఇది గొడవ కథ కాదు. సినిమా షూటింగ్‌లో జరిగిన చిన్న ఘటన. ఆ సంఘటనను స్వయంగా ఆ సీనియర్ నటుడే ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

24
‘సన్నాఫ్ సత్యమూర్తి’లో సంఘటన

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ మ‌ర‌ణం త‌ర్వాత హీరో ఫ్యామిలీ ఓ ఫ్లాట్‌లోకి రెంట్‌కి వెళ్తారు. ఆ స‌మ‌యంలో ఆ ఫ్లాట్ ఓన‌ర్‌గా సీనియ‌ర్ న‌టుడు జెన్నీ (జ‌నార్ధ‌న్ రావు) న‌టించారు. అయితే కథలో భాగంగా జెన్నీ పాత్ర అల్లు అర్జున్‌ను ఎగతాళి చేసే సన్నివేశం ఉంటుంది. కోపంతో హీరో చెంపదెబ్బ కొట్టే షాట్ ఉంటుంది. షాట్ ఓకే అయింది. కానీ కొట్టిన వేగంలో అల్లు అర్జున్ వేళ్లు జెన్నీ కళ్లజోడుకు తగిలాయి. దీంతో క‌ళ్ల‌జోడు కిందపడిపోయి పగిలిపోయింది. ఈ విషయం చూసి యూనిట్ ఒక్కసారిగా ఆగిపోయిందట.

34
అల్లు అర్జున్ స్పందన చూసి ఆశ్చర్యపోయిన జెన్నీ

కళ్లజోడు పగిలిన వెంటనే అల్లు అర్జున్ జెన్నీ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పారు. “అనుకోకుండా జరిగింది సార్” అని పలుమార్లు అన్నారు. వెంటనే తన అసిస్టెంట్‌ను పిలిచి కొత్త కళ్లజోడు వెంటనే కొనిపెట్టాలని ఆదేశించారట. జెన్నీ మాత్రం “పర్లేదు, అవసరం లేదు” అని చెప్పినా, అల్లు అర్జున్ ఒప్పుకోలేదట. “చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరంటే గౌరవం ఉంది” అంటూ కొత్త కళ్లజోడు తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ఆ తర్వాత మేనేజర్ ద్వారా కొత్త కళ్లజోడు పంపించారని ఆయన వెల్లడించారు. ఆ త‌ర్వాత నుంచి ఎక్క‌డ క‌నిపించినా బ‌న్నీ న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తార‌ని జెన్నీ చెప్పుకొచ్చారు. జనర్ధాన్ రావు మాట్లాడిన వీడియో చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

44
పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దిశగా

ఇదిలా ఉంటే ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ స్థాయి పూర్తిగా మారిపోయింది. దక్షిణాదికే పరిమితమైన ఇమేజ్ ఇప్పుడు ఉత్తర భారతంలో కూడా బలంగా నిలిచింది. హిందీలో కూడా అభిమాన వర్గాలు పెరిగాయి. ఇప్పుడాయన అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో బ‌న్నీ వ‌ర‌ల్డ్‌ మార్కెట్‌ను టార్గెట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories