బాలయ్య రెండో కూతురు పెళ్లి రిసెప్షన్‌లో ఘటన.. ఎన్బీకేకి ఝలక్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌, ఏం జరిగిందంటే?

First Published Oct 30, 2024, 6:44 PM IST

బాలకృష్ణకి అల్లు అర్జున్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చాడు. ఏజ్‌ విషయంలో ఆయనకు షాకిచ్చాడు. బాలయ్య కూతురు తేజస్విని రిసెప్షన్‌లో జరిగిన ఘటన పంచుకుని షాకిచ్చాడు. 
 

నందమూరి నట వారసుడు బాలకృష్ణ.. ఎన్టీఆర్ తర్వాత విశేష గుర్తింపు, స్టార్‌ డమ్ తెచ్చుకున్నారు. ఇప్పటికీ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల వరుసగా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టి  సీనియర్‌ హీరోల్లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు బాలకృష్ణ. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. భారీ సినిమాలతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన `ఎన్బీకే109`లో బిజీగా ఉన్నారు. 
 

Balakrishna, allu arjun

ఈ క్రమంలో బాలకృష్ణ, అల్లు అర్జున్‌ మధ్య సాగిన ఓ సరదా కన్వర్జేషన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బాలయ్య రెండో కూతురు పెళ్లి రిసెప్షన్‌లో జరిగిన ఘటన పంచుకుంటూ స్టేజ్‌పై ఎన్బీకేకి బన్నీ ఝలక్ ఇవ్వడం విశేషం. మరి ఇంతకి వీరిద్దరి మధ్య ఏం జరిగింది. బాలయ్య రెండో కూతురు పెళ్లి రిసెప్షన్‌ రోజు ఏం జరిగింది? బాలయ్యకి బన్నీ ఇచ్చిన ఝలక్‌ ఏంటనేది చూస్తే. 

Latest Videos


బాలకృష్ణకి ఇద్దరు కూతుళ్లు బ్రహ్మిణి, తేజస్విని ఉన్నారు. అలాగే కొడుకు మోక్షజ్ఞ తేజ ఉన్నాడు. మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఇవ్వబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమాతో తేజస్విని సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె నిర్మాతగా పరిచయం అవుతుంది. తమ్ముడు మూవీతోనే ఆమె నిర్మాతగా మారడం విశేషం. 

ఇదిలా ఉంటే తేజస్విని 2013లో శ్రీ భరత్ ని వివాహం చేసుకుంది. శ్రీభరత్‌.. గీతం యూనివర్సిటీకి అధినేతగా ఉన్నారు. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు డా ఎంవీవీ ఎస్‌ మూర్తికి ఆయ మనవడు కావడం విశేషం. మరోవైపు ప్రస్తుతం ఆయన విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. తేజస్విని, భరత్‌ మ్యారేజ్‌ రిసెప్షన్‌ పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇందులో చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అందులో భాగంగా అల్లు అర్జున్‌ కూడా వచ్చారు. అయితే రిసెప్షన్‌ స్టేజ్‌పై తేజస్విని, భరత్ తోపాటు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారట. అ సమయంలోనే బన్నీ వచ్చాడు. దీంతో వాళ్లంతా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారట. అది గమనించిన బన్నీ.. ఏంటీ అంత బాగేనా? ఏదైనా ఇబ్బందినా అది అడిగారట. దీంతో వాళ్లుండి, లేదు లేదు.. మా ఫాదర్‌ కొలిగ్‌ ఉన్నారు కదా అని, కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పిందట తేజస్విని. 
 

Unstoppable

అదేంటి తాను కొలిగ్‌ ఏంటని ఆశ్చర్యపోయాడట బన్నీ. మీ ఏజ్‌ గ్రూప్‌లో నన్ను కలిపారేంటి? అని ఒక్క క్షణం షాక్‌ అయ్యాడట. ఈ విషయాన్ని బాలయ్యకే చెప్పారు. చెప్పినందుకు ఆనందం వ్యక్యం చేసిన బాలయ్య, `మీ ఏజ్‌ గ్రూప్‌లో నన్ను కలిపారేంటి? అనే పదానికి హార్ట్ అయిపోయాడు. ఒక్కసారిగా బన్నీని చూస్తూ షాకింగ్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. బన్నీ ఇచ్చిన ఝలక్‌కి మతిపోయింది బాలయ్యకి.

తాను యంగ్‌ అనే ఫీలింగ్‌లోనే బాలయ్య ఇలా రియాక్ట్ కావడం విశేషం. అయితే దీనికి బాలయ్య మాట్లాడుతూ మీ ఏజ్‌ గ్రూప్‌లో నన్ను కలిపారనే హ్యాపీనెస్‌ లేదు. మా ఏజ్‌ గ్రూప్‌లో నిన్ను కలిపినందుకు బాధనా? అబ్బా ఎంత అన్యాయం అయ్యా మీ అల్లు ఫ్యామిలీ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాలయ్య. ఈ ఫన్నీ కన్వర్జేషన్‌ `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే ` షోలో చోటు చేసుకుంది.

మొదటి సీజన్‌లో `పుష్ప` ప్రమోషన్స్ లో భాగంగా ఈ టాక్‌ షోకి వెళ్లారు బన్నీ. సుకుమార్‌, రష్మిక మందన్నాలతో కలిసి ఆయన వెళ్లడం విశేషం. ప్రస్తుతం `అన్‌ స్టాపబుల్` నాల్గోసీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. అయితే ఈ సారి కూడా బన్నీ ఈ షోకి వస్తున్నారట. ఈ సారి చాలా వివాదాస్పద అంశాలకు సమాధానం చెప్పబోతున్నారట. 

ప్రస్తుతం బన్నీ `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. డిసెంబర 5న ఈ మూవీ విడుదల కాబోతుంది. దీంతో మరోసారి ఈ మూవీకి కూడా ప్రమోషన్‌ కాబోతుంది. ఇక బాలయ్య ప్రస్తుతం `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకుడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది.  
read more: `జై హనుమాన్‌`గా స్టార్‌ డైరెక్టర్‌, ఇద్దరు హీరోల మధ్యనే అసలు ఫైట్‌?.. గూస్‌బంమ్స్ అప్‌డేట్‌

click me!