అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కోసం ఇష్టమైన సినిమాని త్యాగం చేయాల్సి వచ్చింది. బన్నీ చేసిన త్యాగం మరో స్టార్ హీరో వారసుడికి ప్లస్ అయింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో కొన్ని మిస్టేక్స్ చేశారు. బన్నీతో పాటు అతడి తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
25
తండ్రి నిర్ణయం వల్ల ఇష్టమైన మూవీ వదులుకున్న అల్లు అర్జున్
అల్లు అరవింద్ నిర్ణయం వల్ల అల్లు అర్జున్ తనకి ఇష్టమైన సినిమాని వదులుకున్నారట. అసలేం జరిగిందంటే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య చిత్రం వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత సుకుమార్ జగడం చిత్రాన్ని కూడా బన్నీతో చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కోసం ఒక ప్రేమ కథా చిత్రం రెడీ చేశారు.
35
ఒప్పుకోని అల్లు అరవింద్
ఆ కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది. తప్పకుండా ఈ సినిమా చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. కానీ అల్లు అరవింద్ అంగీకరించలేదు. ఎందుకంటే ఆ సమయంలో అల్లు అర్జున్ తో.. అరవింద్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ సుకుమార్ చెప్పిన కథ 100 పర్సెంట్ లవ్ చిత్రం. అల్లు అరవింద్ బన్నీతో చేయాలనుకుంటున్న చిత్రం బద్రీనాథ్.
బద్రీనాథ్ మగధీర తర్వాత అంతటి భారీ బడ్జెట్ లో నిర్మించాలని అల్లు అరవింద్ అనుకున్నారు. దీనితో అల్లు అర్జున్ 100 పర్సెంట్ లవ్ చిత్రాన్ని వదులుకోక తప్పలేదు. దీనితో ఆ చిత్రం నాగ చైతన్య చేతుల్లోకి వెళ్ళింది. ఆ విధంగా 100 పర్సెంట్ లవ్ చిత్రంతో నాగ చైతన్య సూపర్ హిట్ అందుకున్నారు.
55
నాగ చైతన్యకి సూపర్ హిట్
కానీ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం బద్రీనాథ్ డిజాస్టర్ అయింది. ఆ విధంగా బన్నీ రిజెక్ట్ చేసిన కథతో నాగ చైతన్య పండగ చేసుకున్నాడు. ఈ మూవీలో చైతు, తమన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. బద్రీనాథ్ లో కూడా తమన్నానే హీరోయిన్.