రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'నరసింహా'(పడయప్ప) సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రను మిస్ అయిన స్టార్ హీరోయిన్ గురించి రజినీకాంత్ ఏమన్నారంటే?
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహా సినిమా రజనీ కెరీర్ ను మరో మలుపు తిప్పించి తమిళంలో పడయప్ప గా తెరకెక్కిన ఈసినిమాను తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.
24
రమ్యకృష్ణకు పేరు తెచ్చిన క్యారెక్టర్
ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర హైలైట్‌గా నిలిచింది. రజినీకాంత్ కు సమానంగా రమ్యకృష్ణ పాత్రను ఇందలో డిజైన్ చేశారు. ఆ పాత్రను ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరనిపించేలా నటించింది. కానీ ఆ పాత్రకు మొదట ఐశ్వర్య రాయ్‌ని సంప్రదించినట్లు రజనీకాంత్ వెల్లడించారు.
34
నీలాంబరి పాత్రకోసం..
రజినీకాంత్ మాట్లాడుతూ.. “సినిమాలో నీలాంబరి చాలా శక్తివంతమైన పాత్ర. ఆ పాత్రకు ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందని నా మనసులో అనిపించింది. ఆమె చాలా బిజీగా ఉన్నా, నెల రోజులైనా సమాధానం రాలేదు. తర్వాత చేస్తానన్నా ఏడాది ఆగడానికి సిద్ధం. కానీ ఆమెకు ఇష్టం లేదని తర్వాత తెలిసింది” అని రజనీకాంత్ చెప్పారు.
శ్రీదేవి, మాధురీ దీక్షిత్, మీనా లాంటి హీరోయిన్లను కూడా నీలాంబరి పాత్ర కోసం అనుకున్నారు. కానీ డైరెక్టర్ రవికుమార్ మాత్రం రమ్యకృష్ణ అయితే బాగుంటుంది అని అన్నారట. మొదట ఈపాత్ర ఆమె చేయగలదా అని రజినీకాంత్ కు సందేహం వచ్చినా.. దర్శకుడి నమ్మకంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. అయితే అందరికంటే అద్భుతంగా ఆ పాత్రను రమ్మకృష్ణ చేసి చూపించారు.