ఎలిమినేషన్‌లో షాకింగ్‌ ట్విస్ట్, గంగవ్వని హౌజ్‌ నుంచి పంపించేసిన నాగ్‌.. బిగ్‌ బాస్‌ చేసిన మిస్టేక్‌ ఇదే

First Published | Nov 9, 2024, 11:36 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగవ్వ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమెని అనూహ్యంగా హౌజ్‌నుంచి పంపించారు నాగ్‌, బిగ్‌ బాస్‌. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో మరో షాకింగ్‌ సంఘటన జరిగింది. పదో వారం ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్‌ బాస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్థాంతరంగా కంటెస్టెంట్‌ని ఎలిమినేట్‌ చేశారు. గంగవ్వని మధ్యలోనే ఎలిమినేట్‌ చేశారు. ఇదిప్పుడు అటు హౌజ్‌మేట్స్ కి, ఇటు ఆడియెన్స్ కి షాకిస్తుంది. మరి గంగవ్వని ఎలిమినేట్‌ చేయడానికి కారణమేంటనేది చూస్తే 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గంగవ్వ బిగ్‌ బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో హౌజ్‌లోకి వచ్చింది. ఆమెకి అనారోగ్య సమస్యలు రావడంతో మధ్యలోనే హౌజ్‌ నుంచి పంపించారు. ఏజ్‌ పెరగడంతో ఏసీలో ఉండటమనేది చాలా కష్టం. దీని తాలూకు చాలా సమస్యలు వెంటాడుతుంటాయి. పైగా ఏసీ అలవాటు లేని వారికి చాలా సమస్య వస్తాయి. బాడీ హీటెక్కుతుంది. మంటలు రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు గంగవ్వకి కూడా అదే జరిగింది.

తనకు చేతులు, అరికాళ్లు మంటలుగా వస్తున్నాయని తెలిపింది గంగవ్వ. నాగార్జున ముందు తన బాధని, ఇబ్బందిని వెల్లడించింది. వరుసగా డేపులు వస్తున్నట్టు తెలిపింది. దీంతో మరో మాట లేకుండా బిగ్‌ బాస్‌తోపాటు నాగార్జున.. గంగవ్వని హౌజ్‌ నుంచి పంపించారు. ఆమె జర్నీ కూడా చూపించకుండానే పంపించడం గమనార్హం. 
 


అయితే గంగవ్వ వెళ్లిపోతున్నారనే విషయం తెలిసి హౌజ్‌ మేట్స్‌ అంతా ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా రోహిణి, టేస్టీ తేజ బాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తంగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో గంగవ్వ ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఈ వారం మరో ఎలిమినేషన్‌ కూడా ఉండబోతుంది. గంగవ్వ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌గా చెప్పొచ్చు. ఇక ఆదివారం మరో ఎలిమినేషన్‌ ఉండబోతుంది. తక్కువ ఓటింగ్‌ కారణంగా హరితేజ ఎలిమినేట్‌ అవుతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే గంగవ్వ ఎలిమినేషన్‌కి సంబంధించిన విమర్శలు వస్తున్నాయి. నిజానికి గంగవ్వ వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి వస్తుందనే వార్తలు వచ్చినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. గంగవ్వ హౌజ్‌లోకి వద్దు అంటూ ట్రోల్‌ చేశారు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వారిని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఇలా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారిలో ఇప్పటికే మెహబూబ్‌, నయనీ పావని ఎలిమినేట్‌ అయ్యారు.

ఇప్పుడు పదోవారం గంగవ్వని ఎలిమినేట్‌ చేశారు. ఆమె హౌజ్‌లోకి వచ్చినప్పట్నుంచి పెద్దగా హడావుడి చేసింది లేదు, సైలెంట్‌ గా చూస్తూ ఉండిపోయింది. ఏజ్‌ కారణంగా ఏ ఆటలోనూ పాల్గొనలేకపోయింది. గత సీజన్‌లోనూ అలానే చేసింది. అందుకే మధ్యలోనే ఆమెని పంపించారు. ఇప్పుడు మరోసారి గంగవ్వకి అలాంటి సమస్యనే రావడంతో ఇక తప్పని పరిస్థితిలో హౌజ్‌ నుంచి పంపించినట్టు తెలుస్తుంది.

ఈ విషయంలో బిగ్‌ బాస్‌ పెద్ద మిస్టేక్ చేశారు. మరో కొత్త కంటెస్టెంట్‌కి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగా ఆటలైనా ఆడేవారు, ఎంటర్టైన్‌ చేసేవారు. కానీ గంగవ్వ ఈ రెండూ చేయలేకపోయింది. అలాంటప్పుడు ఆమెని తీసుకురావడం వెనుక ఉన్న కారణమేంటనేది అర్థం కాని ప్రశ్న.  
 

మరోవైపు శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజకి పెద్ద షాక్‌ తగిలింది. ఆయనకు రెండు రకాలుగా షాక్‌లు తగిలాయి. ఒకటి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ని హౌజ్‌ గెలుచుకోలేకపోయింది. ఇలా విఫలం కావడానికి టేస్టీ తేజనే కారణమని భావించిన నాగార్జున ఆయనకు పనీష్‌మెంట్‌ వేశారు. వచ్చే వారం మెగా చీఫ్‌ కంటెండర్‌గా పోటీ పడే అవకాశాన్ని కోల్పోయాడు.

అంతేకాదు వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ విసయంలో ఎక్కువ ఓట్లు పడటంతో తేజ ఫ్యామిలీ హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయాడు. తన తల్లిని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకురావాలనే ఆశయంతోనే హౌజ్‌లోకి వచ్చాడు తేజ. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ని కోల్పోయాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. 

Read more: తలక్రిందులైన బిగ్‌ బాస్‌ ఓటింగ్‌, పదో వారం ఎలిమినేషన్‌, హౌజ్‌ని వీడేది ఆ కంటెస్టెంటే?

also read: `గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

Latest Videos

click me!