ఇక మధ్యలో వచ్చి పోయేవారు చాలామంది ఉన్నారు. కాగా ఈసిరిస్ సూపర్ హిట్ అవ్వడంతో.. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ సీఐడీ సీరియల్ కు సీక్వెల్ ను తీసుకురాబోతున్నట్టు టీమ్ ప్రకటించారు. అక్టోబర్ 26న ఈసీరియల్ సీక్వెల్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాదు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈసిరిస్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీమ్.
ఈ నవంబర్ లో షూటింగ్ మొదలవుతుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు టీమ్. ఇక ఇందులోని పాత్రలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఏసీపీ ప్రద్యుమన్ నుంచి దయా అలియాస్ జోసెఫ్ వరకు నటీనటులంతా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. సీఐడీ టీవీ సిరీస్ లో శివాజీ సతం, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి, దినేష్ ఫడ్నిస్, నరేంద్ర గుప్త, అన్ష సాయేద్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: అత్యంత ధనవంతుడైన స్టార్ కిడ్ ఎవరో తెలుసా?