`పుష్ప 3` స్టార్ట్ అయ్యేది అప్పుడే.. సుకుమార్‌ ఆల్‌రెడీ ప్లాన్‌ రెడీ.. ఈ సారి వేరే లెవల్‌

Published : Nov 28, 2025, 05:46 PM IST

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలు వచ్చి సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు `పుష్ప 3` కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. 

PREV
14
పుష్ప 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ని తిరుగులేని పాన్‌ ఇండియా స్టార్‌ని చేసిన సినిమా `పుష్ప`. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి పార్ట్ నాలుగేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.350కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా సౌత్‌లో కంటే నార్త్ లో బాగా ఆడింది. అక్కడి ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రష్మిక మందన్నాతో కలిసి చేసే డాన్సులు, సమంత స్పెషల్ సాంగ్‌, అల్లు అర్జున్‌ మ్యానరిజం, యాక్షన్‌, సుకుమార్‌ టేకింగ్‌ సినిమాని మరే స్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు.

24
`పుష్ప 2` కలెక్షన్లు

దీంతో టీమ్‌కి `పుష్ప 2`పై కాన్ఫిడెన్స్ వచ్చింది. దీన్ని అత్యంత భారీగా ప్లాన్‌ చేశారు. భారీ స్కేల్‌లో తెరకెక్కించారు. పార్ట్ 1 లోకల్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగితే, పుష్ప.. పుష్పరాజ్‌గా ఎదిగితే, `పుష్ప 2`లో లోకల్‌ నుంచి నేషనల్‌ స్మగ్లర్‌గా పుష్ప ఎదగడం నేపథ్యంలో రూపొందించారు. ఓ రకంగా పుష్పగాడి రూల్‌ అనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సుకుమార్‌. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్ లు, పుష్ప ఇచ్చే ట్విస్ట్ లు హైలైట్‌గా నిలిచాయి. దీంతో సినిమా ఇండియా వైడ్‌గా దుమ్ములేపింది. నార్త్ ఇండియా బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు.

34
అట్లీతో గ్లోబల్‌ మూవీ చేస్తున్న బన్నీ

ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌పై కన్నేశారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో `ఏఏ22` చిత్రం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ ని కొల్లగొట్టాలని, అదే సమయంలో తాను గ్లోబల్‌ స్టార్‌గా ఎదగాలని భావిస్తున్నారు బన్నీ. అలానే ఇప్పుడు అట్లీతో చేయబోతున్న సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు.

44
`పుష్ప 3` షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చిన నిర్మాత

ఈ క్రమంలో ఇప్పుడు `పుష్ప 3` సినిమాకి సంబంధించిన అప్‌ డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన గుడ్‌ న్యూస్‌ చెప్పారు మైత్రీ మూవీ మేకర్‌ నిర్మాత రవిశంకర్‌. `పుష్ప 3` ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలిపారు. 2027 ఎండింగ్‌లో ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన సెటప్‌, కథ కూడా సుకుమార్‌ రెడీ చేశారట. చరణ్‌తో చేయబోతున్న సినిమా పూర్తయిన తర్వాత బన్నీ, సుకుమార్‌ ల కాంబోలో `పుష్ప3` ప్రారంభమవుతుందన్నారు. ఇది భారీ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతుందని, కాంటెంపరరీ కథతో ఈ చిత్రం ఉంటుందని, సుకుమార్‌, చరణ్‌ కాంబినేషన్‌లో మూవీ ఎలా ఉంటుందో తెలిసిందే, అంచనాలను అందుకునేలా ఉంటుందన్నారు రవిశంకర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories