పుష్ప 2: 15 రోజుల్లో ఊచకోత… మాస్ భీభత్సం!!

First Published | Dec 20, 2024, 7:31 AM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1426 కోట్ల గ్రాస్ వసూలు చేసి, 2024లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నా  కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయ్యి 15 రోజులు పూర్తి అయినా ఎక్కడా బ్రేక్ పడటం లేదు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి  1403 కోట్లకు పైగా గ్రాస్  ని సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసోంది ఈ  సినిమా.

 15వ రోజు వర్కింగ్ డే అయినా సరే  చాలా చోట్ల సాలిడ్ హోల్డ్ ని చూపించి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఈ నేఫధ్యంలో ఈ సినిమా 14 రోజుల్లో తెలుగు వెర్షన్ ఎంత గ్రాస్ వచ్చింది, ఆ లెక్కలు ఏమిటో చూద్దాం.
 

Allu Arjun, #Pushpa2, sukumar


 ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ ఈ గురువారం(డిసెంబర్ 19)  తో బాక్సాఫీస్ వద్ద రెండు వారాల రన్ పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తోంది.

ఇక  పుష్ప 2 మూవీకి మనదేశంలో 14వ రోజున రూ. 20.8 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. వాటిలో తెలుగు నుంచి రూ. 3.25 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో అత్యధికంగా 16.25 కోట్లు వచ్చాయి. ఇక తమిళం నుంచి కోటి వస్తే.. కన్నడ, మలయాళం నుంచి చెరో 15 లక్షలు మాత్రమే వచ్చాయి. అలాగే, 13వ రోజుతో పోల్చుకుంటే 14వ రోజు ఇండియాలో పుష్ప 2 కలెక్షన్స్ 10.92 శాతం తగ్గాయి.
 


Pushpa 2, Sukumar, allu arjun

అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 14 రోజుల్లో తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ భాక్సాఫీస్ కలెక్షన్స్ 

ఏరియా      షేర్      

నైజాం ₹  88 కోట్ల ₹ 
సీడెడ్ ₹  31 కోట్ల ₹  
ఉత్తరాంధ్ర  ₹ 21.6 కోట్లు ₹ 
గుంటూరు  ₹ 14.5 కోట్లు ₹  
తూర్పు గోదావరి  ₹ 11.8 కోట్లు ₹  
పశ్చిమ గోదావరి  ₹ 9 కోట్లు ₹ 
కృష్ణ  ₹ 12 కోట్లు ₹  
నెల్లూరు  ₹ 7.1 కోట్లు ₹  
AP/TS  ₹ 195 కోట్లు ₹  
ROI (సుమారు)  ₹ 31 Cr ₹  
ఓవర్సీస్  ₹ 54 కోట్లు ₹  
ప్రపంచవ్యాప్తంగా  ₹ 280 కోట్లు ₹  


ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరుని చూపెడుతున్న సినిమా టోటల్ గా 15వ రోజున వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. దాంతో  గ్రాస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది…

మొత్తం మీద  సినిమా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 297 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుందని, వరల్డ్ వైడ్ గా సినిమా 1426 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను వచ్చిందని తెలుస్తోంది. ఏ రోజు కా రోజు కొత్త రికార్డులతో దూసుకు పోతున్న సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు కేంద్రంగా మారుతుందో చూడాలి. 

Allu Arjun, #Pushpa2, sukumar


ఇప్పటికి వచ్చిన ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. అటు నార్త్ బెల్ట్  లోను పుష్ప రాజ్ ర్యాంపేజ్ ఆగటం  లేదు అని చెప్పాలి. అక్కడి స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాల ను సైతం వెనక్కి నెట్టి రికార్డ్ కలెక్షన్స్ అందుకుంది. ఈ లెక్కన చుస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో రూ. 2000 కోట్ల మార్క్ ను అందుకున్న ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

Latest Videos

click me!