Thalapathy Vijay, Bhagavanth Kesari, Remake
గాడ్ అఫ్ మాసెస్ గా అభిమానులు చెప్పుకునే నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనిల్ రావిపూడి తన కామెడీ జానర్ ను పక్కన పెట్టి మొదటిసారి సరికొత్త కథ, కాదనాలతో బాలయ్యను సెటిల్డ్ గా ప్రెసెంట్ చేసాడు. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. రీసెంట్ గా 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది. ఈ సినిమాని తమిళ హీరో విజయ్ రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేని తమిళ మీడియా చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో అసలు నిజం ఏమిటనేది చూద్దాం.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘ది గోట్’ సినిమాతో యావరేజ్ దక్కింది. తెలుగులో అయితే డిజాస్టర్ అయ్యింది. తమిళ బాక్సాఫీస్ వద్ద టాక్ కు సంభందం లేకుండా భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దీంతో చివరి సినిమాగా అంటూ చేస్తున్న తాజా చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్.
ఇప్పుడు ‘దళపతి 69’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయ్యారు.
అలాగే మలయాళ నటి మమతా బైజు,పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కాగా దళపతి విజయ్ ఆఖరి సినిమా తెలుగు సినిమా‘భగవంత్ కేసరి’కు రీమేక్ అని వార్తలు మొదలయ్యాయి ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉండటంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. అయితే అసలు నిజం వేరే ఉందిట.
Thalapathy Vijay
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజయ్ నిజంగానే రీమేక్ రైట్స్ కొన్నాడు కానీ అఫీషియల్ గా రీమేక్ చేయడం లేదు. కొన్ని పాత్రలు ఒరిజినల్‌కు సిమిలర్ గా అనిపించాయి కాబట్టి మేకర్స్ ఎలాంటి సమస్యలు రాకుండా రైట్స్ కొనుగోలు చేసారు. ‘దళపతి 69’ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజ, విజయ్ ల రిలేషన్ ఓ గార్డియన్ కు, ఓ నడివయస్సు వ్యక్తికి మధ్య ఉంటుంది. 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఉండే రిలేషన్ కూడా ఇలాంటిదే. రేపు కాపీ రైట్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. కేవలం ఆ ఒక్క విషయంలోనే పోలిక కానీ మిగతా కథ , స్క్రీన్‌ప్లే మొత్తం వేరేగా ఉండబోతోందిట.
Thalapathy vijay
పూజ హెగ్డే పాత్ర కూడా తెలుగులో కాజల్ అగర్వాల్ ని పోలి ఉండదట. వీళ్లిద్దరి మధ్యా మంచి ఫన్, లవ్ ట్రాక్, పాటలు ఉంటాయి. తెలుగులో మిస్సైన ఎలిమెంట్స్ ఇక్కడ రికవరీ చేస్తారు. రొమాన్స్ ,యాక్షన్ తో కూడిన స్ట్రైయిట్ సబ్జెక్టు ఇది అని తెలుస్తోంది. తెలుగు సినిమాని రీమేక్ చేస్తే తెలుగులో విజయ్ మార్కెట్ కు పెద్ద దెబ్బ కాబట్టే ఇలాంటివి చేయదలచుకోలేదని చెప్తున్నారు.
thalapathy vijay
భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ బాగా ఎక్కింది. ‘దళపతి 69’ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇప్పటికే పార్టీని ప్రకటించడం విశేషం. అందుకే ఆయన ఆఖరి సినిమాలో సైడ్ ట్రాక్ లో రాజకీయాలను టచ్ చేసేలా కథ ఉంటుందని అంటున్నారు. సినిమా టైటిల్ రివీల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.