మహేష్‌ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ, బన్నీ, ప్రభాస్‌.. కొత్త బిజినెస్‌ ప్లాన్‌ అదిరిందిగా!

First Published | Jun 30, 2021, 9:42 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సినిమాలే కాదు, కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్నారు. అదిరిపోయేలా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మహేష్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, బన్నీ, ప్రభాస్‌ ఆయన ఆడుగుజాడల్లో నడుస్తున్నారు.

మహేష్‌ బాబు ట్రెండీవేర్‌, రియల్ ఎస్టేట్‌, ప్రొడక్షన్‌, ప్రకటనలతోపాటు మల్టీప్లెక్స్ లోనూ సక్సెస్‌ సాధించాడు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఆయన `ఏఎంబీ`(ఏషియన్‌ మహేష్‌బాబు) మల్టీప్లెక్స్ ని మాదాపూర్‌లో ప్రారంభించారు.
ఇది హైదరాబాద్‌లోనే అత్యంత అత్యాధునిక మల్టీప్లెక్స్ కావడం విశేషం. మన రెండు తెలుగు రాష్టాల్లోనే దాన్ని మించిన మల్టీప్లెక్స్ మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. సీటింగ్‌ కెపాసిటీ, డిజైనింగ్‌, స్క్రిన్‌ ఇలా అన్నింటినిలోనూ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో దీన్ని నిర్మించారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది.

అయితే ఏషియన్‌తో కలిసి పనిచేయాలనేది మహేష్‌ ఇంట్రెస్ట్ అని ఏషియన్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ తెలిపారు. తాము ఇలా షాపింగ్‌ మాల్‌ విత్‌ మల్టీప్లెక్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పినప్పుడు తాము కూడా భాగస్వామ్యమవుతామని నమ్రత ఇంట్రెస్ట్ చూపించడంతో కలిసి దీన్ని నిర్మించినట్టు నిర్మాత, ఏషియన్‌ సినిమాస్‌ అధినేత తెలిపారు.
ఇది సక్సెస్‌ కావడంతో దీన్నే ఫాలో అవుతున్నారు రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఆయన `రౌడీ వేర్‌`తో ట్రెండ్స్ ని స్టార్ట్ చేశాడు. అలాగే ప్రొడక్షన్‌ కూడా ప్రారంభించారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ లో భాగమవుతున్నారు.
మహబూబ్‌ నగర్‌లో దీన్ని నిర్మిస్తున్నారు. `ఏవీడీ`(ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ) పేరుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చింది. త్వరలోనే లాంచ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ కూడా అత్యాధునిక సదుపాయాలతో, ప్రమాణాలతో ఉంటుందని సమాచారం.
మహేష్‌ అడుగుజాడల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా నడుస్తున్నాడు. ఆయన అమీర్‌ పేటలో సత్యం థియేటర్‌ స్థానంలో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది.
`ఏఏఏ`(ఏషియన్‌ అల్లు అర్జున్‌) పేరుతో దీన్నినిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో `ఏఎంబీ` తర్వాత ఆ రేంజ్‌లో దీన్ని నిర్మాణం జరుగుతుందని సమాచారం. బన్నీ క్రమంగా ఇతర బిజినెస్‌లోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ మల్టీప్లెక్స్ లో భాగమయ్యారట.
వీరితోపాటు ప్రభాస్‌ కూడా మల్టీప్లెక్స్ లోకి అడుగుపెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. తన హోం బ్యానర్‌ `యూవీ` క్రియేషన్స్ కి ఇప్పటికే పలు మల్టీప్లెక్స్ లున్నాయి. వారితో కలిసి ప్రభాస్‌ భారీ స్థాయిలో మల్టీప్లెక్స్ నిర్మించాలని ప్లాన్‌ జరుగుతుందని సమాచారం.
ప్రభాస్‌ అంటే ఇప్పుడు పాన్ ఇండియాస్టార్‌. తాను నిర్మించబోయే మల్టీప్లెక్స్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తంగా మహేష్‌ చూపిన దారిలో విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ నడుస్తూ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. ఇప్పుడు అన్ని థియేటర్లు ఏసీలోకి మారిపోతున్నాయి. నాన్‌ ఏసీ థియేటర్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అదే సమయంలో జనం మల్టీప్లెక్స్ ల్లో, ముఖ్యంగా సంపన్న వర్గాలు, హైదరాబాద్‌లో నివసించే చాలా మంది ఇలాంటి లగ్జరీ మల్టీప్లెక్స్ ల్లో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో వారి ఇంట్రెస్ట్ ని క్యాష్‌ చేసుకునేందుకు అదిరిపోయే బిజినెస్‌ ప్లాన్‌ చేస్లున్నారు మన స్టార్‌ హీరోలు.

Latest Videos

click me!