బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 11 వారాలు గడిపోయాయి. ఇక ఈ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఓ బలం వచ్చేసింది పిల్లలకు. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్లు ఫుల్ ఛార్జ్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి శుక్రవారం నాడు ఏం జరిగిందో చూపించాడు. అందులో కంటెస్టెంట్లు తమ తమ లవ్ స్టోరీలను చెప్పేశారు. ఈ క్రమంలో యష్మీ , జబర్దస్త్ రోహిణి, టేస్టీ తేజ, నిఖిల్, పృధ్వీలు కూడా తమ ప్రేమ కథల్ని చెప్పుకొచ్చారు.
ఓ బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమిస్తుందో అలా నన్ను కూడా క్షమించు.. నేను చేసిన వాటికి సారీ చెబుతున్నా అంటూ నిఖిల్ ఏడ్చేశాడు. అంటే కావ్యను నిఖిల్ ఒప్పించే ప్రయత్నం ఇంకా చేస్తాడనిపిస్తోంది. సో సీరియల్స్ లో ఈ జంట చాలా ఫేమస్. కాని ఆతరువాత వీరికి బ్రేకప్ అయ్యిందన్న వార్తలు వినిపించాయి. కాని మల్లీ తానే తగ్గి తన ప్రియురాలిని పిలవడం చాలా కష్టం కాని చేసి చేపించారు.