సినిమా హీరోలకు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్ల అభిమానమే హీరోలకు పెట్టుబడిగానూ మారుతుంది. మార్కెట్‌ని బట్టే వారికి పారితోషికాలుంటాయి. అయితే క్రేజ్‌ని వాడుకుని హీరోలు బాగానే సంపాదిస్తుంటారు. సినిమాలకు పారితోషికం, యాడ్స్ రూపంలో సంపాదిస్తుంటారు. వాటిని వ్యాపారాల్లో పెడుతుంటారు. ఇలా రెండు చేతులా గట్టిగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వ్యాపారానికి ప్రయారిటీ పెరగడంతో అంతా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సంపాదన పెంచుకుంటున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, ఏ వుడ్ అయినా, ఏ హీరో, దర్శక, నిర్మాత అయినా వందల కోట్లు, మహా అయితే వెయ్యి కోట్లు ఇంకా చెప్పాలంటే పదివేల కోట్లకు లోపే ఆస్తి పరులుగా ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి దాక, ఇప్పుడు ప్రభాస్, మహేష్, రవితేజ..
అలాగే రజనీ, విజయ్, సూర్య, అజిత్, కమల్, మరోవైపు అమితాబ్, షారూఖ్, సల్మాన్, అమీర్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ ఇలా ఏ హీరో అయితే పది వేల కోట్ల లోపు ఆస్తిపరుల జాబితాలోకే వస్తారు. కానీ ఓ తెలుగు సీనియర్ స్టార్ మాత్రం వేల కోట్లకు అధిపతి కావడం విశేషం. మరి ఆయన ఎవరో చూస్తే..
Sobhan Babu
ఆయన ఎవరో కాదు, శోభన్‌బాబు. సోగ్గాడిగా వెలిగి, ఇప్పటికీ సోగ్గాడిగా కీర్తించబడుతున్న శోభన్ బాబు వేల కోట్లకు ఆస్తిపరుడు. ఆయన సినిమాల్లో సంపాదించిందంతా ల్యాండ్‌పై పెట్టారనే విషయం తెలిసిందే. అప్పట్లో వందల ఎకరాల ల్యాండ్ కొన్నాడని అంతా చెబుతుంటారు. నటుడు చంద్రమోహన్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. చెన్నైలో సగం సిటీ ఆయనదే అని, అన్నా నగర్‌లో తన ప్రాపర్టీస్ చూపించడానికి ఒక పూట పట్టిందట. ఒక్క అన్నా నగర్‌లోనే 18 ప్రాపర్టీస్ చూపించాడట.
వాటిలో చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయట. వాటిని చూసుకోవడానికి మనుషులను పెట్టాడట. 25 మంది వరకు అందులో పని చేస్తారని, వారికి ఒక జనరల్ మేనేజర్ కూడా ఉండేవాడని తెలిపారు. శోభన్ బాబు కొన్న ప్రాపర్టీస్ అన్నీ చూస్తే సగం చెన్నై సిటీ ఆయనదే అనేంత ఉంటుందని, ఇంకా చెప్పాలంటే వాడు చెన్నై నవాబ్ అని కితాబిచ్చాడు చంద్రమోహన్.
తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మండి రామారావు సైతం సంచలన ప్రకటన చేశాడు. 80వేల కోట్లకి అధిపతి శోభన్‌బాబు అని చెప్పారు. జయలలిత విషయం చెబుతూ, ఆమెకి దీటుగా ఎదిగాడని, వేల కోట్లు సంపాదించాడని తెలిపారు. జయలలితని ఆయన ఎంతగానో ప్రేమించాడని, ఆమె సైతం ఎంతో ప్రేమించిందనే విషయం తెలిసిందే.
అయితే జయలలితపై ప్రేమని ఓ బుక్‌లో కూడా సీరియల్ లాగా రాశాడట. తాను అప్పటికే మ్యారేజ్ అయిన నేపథ్యంలో ఆమెని పెళ్లి చేసుకోలేకపోయాడని, లేదంటే ఈఇద్దరు మ్యారేజ్ చేసుకునేవారని చెప్పాడు. కానీ ఎవరికి వారు దూరంగా ఉండి, ఒకరి శ్రేయస్సుని మరొకరు కోరుకున్నారని తెలిపారు. అందుకే వాళ్లు చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు.
శోభన్‌బాబుకి జయలలిత కొన్ని వేల కోట్లు ఇచ్చిందనే రూమర్ కూడా ఉంది. అప్పట్లో ఎంజీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జయలలిత ఆయనకు అనుచరురాలిగా ఉన్నది. ఆ సమయంలో స్విస్ బ్యాంకుల్లో డబ్బుని దాచేవారట ఎంజీఆర్. అలా సుమారు 3వేల కోట్లు స్విస్ బ్యాంక్‌ల్లో దాచాడట. ఆ వివరాలను తన తలపైన పెట్టుకునే టోపీలో దాచుకునేవాడట.
ఈ క్రమంలో అవి జయలలిత చూసిందట. వాటిని తీసుకుని ఆ మనీని ఎలా ప్రాసెస్ చేయాలనేది అన్ని తెలుసుకుని ఆ అమౌంట్‌ని శోభన్‌బాబుకి ఇచ్చేసిందట. దానివల్లే సోగ్గాడు అంతటి వేల కోట్లు సంపాదించాడని చెబుతుంటారు. ఏది నిజమనేది వారికే తెలియాలి.