‘సలార్‌’ లొకేషన్ ఫొటోలు :మెకానిక్ గా ప్రభాస్‌..ఏ సీన్స్ అంటే..

First Published | Jan 31, 2021, 12:29 PM IST

 సలార్‍ చిత్రం కథలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‍ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర  టీమ్...ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‍ వేసింది. ఇక్కడ పది రోజుల పాటు ఓపెన్‍ కాస్ట్ గనిలో షూటింగ్‍ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‍ బ్యానర్‍పై విజయ్‍ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‍ గౌడ్‍, సంగీతం రవి బస్రూర్‍ అందిస్తున్నారు.

ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌’ సినిమా షూటింగ్ పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక్కడే పది రోజులు పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
‘సలార్’‌ సినిమా రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర ఓ సెట్టింగ్‌ ను వేసింది చిత్రయూనిట్. పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనుందట.

ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతోంది.
ఇక గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లెందు గెస్ట్ హౌస్ లో బస చేసిన ప్రభాస్‌ను రామగుండం సీపీ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి నేరుగా పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు మధ్య గోదావరిఖని చౌరస్తా, ఫైవింక్లైయిన్‌కాలనీ మీదుగా ప్రత్యేక వాహన శ్రేణిలో రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి ఆర్జీ-3లోని రెండో ఉపరితల గని(ఓసీపీ-2)కు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌, చిత్ర యూనిట్ తో కలిసి చేరుకున్నారు.
నాలుగు రోజులుగా ఉపరితల గనుల్లో నిర్మించిన సెట్‌లో కాకుండా వర్క్‌షాప్‌లో ఉన్న 5 భారీ హైడ్రాలిక్‌ డంపర్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేసారు.
ప్రభాస్‌ మెకానిక్‌ గెటప్‌లో మాస్‌లుక్‌తో డంపర్‌లున్న వర్క్‌షాప్‌ నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న యాక్షన్‌ ఛేజింగ్‌ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్‌ షూట్ చేసారు. అనంతరం ప్రభాస్‌ గోదావరిఖనిలోని ఇల్లెందు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా షూటింగ్‌ను తిలకించేందుకు కరీంనగర్‌, గోదావరిఖని, పన్నూరు, లద్నాపూర్‌, నాగేపల్లి, రాజాపూర్‌, సెంటినరీకాలనీ, కమాన్‌పూర్‌, మంథని, పెద్దపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
రామగుండం అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) సంజీవ్‌, మంథని సీఐ మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ముందుజాగ్రత్తగా ఎవరినీ షూటింగ్‌ స్పాట్‌కు రాకుండా చర్యలు తీసుకున్నారు.
Salaarఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది.
ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఇంతవరకు ఏ హీరోకు లేని విధంగా డిజైన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.
ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చెయ్యాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. భారీ చిత్రమైనా చక్కటి ప్లానింగ్ తో స్పీడుగా ఈ సినిమాని ఫినిష్ చేయాలనేది డైరక్టర్ ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ కు ఇచ్చిన మాట అని తెలుస్తోంది.
ఈ సినిమా టైటిల్ అర్ధం దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.

Latest Videos

click me!