Allu Arjun with Bhansali: భన్సాలీని కలిసిన బన్నీ.. బాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌.. ?

Published : Mar 14, 2022, 10:07 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ `పుష్ప`తో బాలీవుడ్‌లో తన సత్తాని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ ఎంట్రీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఓ వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 

PREV
15
Allu Arjun with Bhansali: భన్సాలీని కలిసిన బన్నీ.. బాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌.. ?

అల్లు అర్జున్‌(Allu Arjun) తాను నటించిన `పుష్ప`(Pushpa) సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. హిందీలో ఈ సినిమా ఊహించని స్థాయిలో వంద కోట్లు కలెక్ట్ చేసి అటు బాలీవుడ్‌ వర్గాలని, ఇటు చిత్ర యూనిట్‌తోపాటు టాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్‌ రూపొందించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి హిందీ ఆడియెన్స్ ని అలరించింది. దీంతో హిందీ మార్కెట్‌పై బన్నీకి మంచి పట్టు ఏర్పడింది. 
 

25

అయితే సరైనా కథ దొరికితే, సరైన డైరెక్డర్‌ పడితే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని బన్నీ భావిస్తున్నారు. గతంలోనూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే బన్నీ నెక్ట్స్ ప్లాన్‌ బాలీవుడ్‌ అనే తెలుస్తుంది. తాజాగా బన్నీ ముంబయిలో హల్‌చల్‌ చేశారు. ఓ ఈవెంట్‌ కోసం ముంబయికి వెళ్లిన అల్లు అర్జున్‌ అక్కడ భారీ సినిమాల దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీని కలిశారు. ముంబయిలో భన్సాలీ ఆఫీస్‌ ముందు బన్నీ కారు దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని బట్టి వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అయినట్టే అనే టాక్‌ మొదలైంది. 

35

భన్సాలీ(Sanjay Leela Bhansali)తో బన్నీ సినిమా చేయబోతున్నారంటే అది మామూలు విషయంలో కాదు. భారీ స్థాయిలోనే ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే హిందీలో భారీ చిత్రాలకు కేరాఫ్‌ సంజయ్‌ లీలా భన్సాలీ. `ఖామోషి`, `దేవదాస్‌`, `రామ్‌లీలా`, `సావరియా`, `గుజారిష్‌`, `బాజీరావు మస్తానీ`, `పద్మావత్‌`, ఇటీవల `గంగూబాయిః కథియవాడి` చిత్రాలను రూపొందించారు. విజువల్‌ వండర్స్ ని క్రియేట్‌ చేయడంలో భన్సాలీ తర్వాతే ఎవరైనా అనేంతగా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారాయన. 

45

అలాంటి భన్సాలీతో బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ కాబోతున్నారనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను, టాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఖుషీ చేస్తుంది. అంతేకాదు ఐకాన్‌ స్టార్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కి లైన్‌ క్లీయర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆమధ్య నిర్మాత అల్లు అరవింద్‌ సైతం భన్సాలీని కలిశారు. ఆ సమయలోనే బన్నీతో సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయనే టాక్‌ వినిపించింది. ఇప్పుడు ఏకంగా బన్నీ.. భన్సాలీని కలిశారనే వార్త ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్  తెప్పిస్తుంది. 

55

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్పః ది రూల్‌` చిత్రంలో నటించబోతున్నారు. `పుష్ప`కిది పార్ట్ 2. మే నుంచి పట్టాలెక్క నుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను, అట్లీ దర్శకులతో బన్నీకి కమిట్‌మెంట్స్ ఉన్నాయి. వీరితోపాటు కొరటాల శివ, వేణు శ్రీరామ్‌లతోనూ సినిమాలు ప్రకటించారు. మరి ఆయా సినిమాలు ఉంటాయా? లేవా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ బాలీవుడ్‌ లైన్‌ క్లీయర్‌ అయితే `పుష్ప` పార్ట్ 2 తర్వాత బన్నీ హిందీ సినిమానే చేయబోతున్నారా? అనే ఆసక్తి,సస్పెన్స్ నెలకొంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇకపై బన్నీ తన సినిమాలన్నీంటిని పాన్‌ ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories