Allu Arjun-Priyamani: ప్రియమణిపై బన్నీ హాట్‌ కామెంట్.. `ఢీ` భామ చేసిన పనికి అంతా ఫిదా..హోరెత్తిపోయిన షో

Published : Dec 08, 2021, 03:10 PM ISTUpdated : Dec 08, 2021, 03:15 PM IST

`ఢీ` భామ ప్రియమణి.. తన కోరికని బయటపెట్టింది. చాలా రోజులుగా తనలో ఉన్న ఫీలింగ్‌ని అల్లు అర్జున్‌తో పంచుకుంది. ఆయనతో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. దీంతో బన్నీ రెచ్చిపోయారు. ఆమెపై హాట్‌ కామెంట్‌ చేశారు. దీంతో `ఢీ` షో మొత్తం హోరెత్తిపోయింది.   

PREV
18
Allu Arjun-Priyamani: ప్రియమణిపై బన్నీ హాట్‌ కామెంట్.. `ఢీ` భామ చేసిన పనికి అంతా ఫిదా..హోరెత్తిపోయిన షో

అల్లు అర్జున్‌(Allu Arjun) ఇటీవల వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇతర సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో గెస్ట్ గా పాల్గొంటూ అలరిస్తున్నారు. సినిమాలను ప్రమోట్‌ చేస్తున్నారు. మరోవైపు తాను నటిస్తున్న `పుష్ప` సినిమాని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన ఈటీవీ ప్రసారమవుతున్న `ఢీ`(Dhee Show) షోలో పాల్గొన్నారు. `ఢీ` డ్యాన్స్ షో 13వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. గ్రాండ్‌ ఫినాలే నేడు(బుధవారం) వేదిక కానుంది. నేడు ప్రసారం కానుంది.
 

28

Dhee Grand Finale గెస్ట్ గా పాల్గొన్న బన్నీ.. డాన్సర్ల అద్భుతమైన డాన్సు కి ఫిదా అయ్యారు. తనకిది చాలా స్పెషల్‌ అని తెలిపారు. అంతేకాదు ఈ షోలో డాన్స్ చూస్తుంటే బయట ఇంత బాగా చేస్తున్నారు, తాను ఇంకా ప్రాక్టీస్‌ చేయాలనిపిస్తుందని చెప్పారు. తనకిచ్చిన ట్రిబ్యూట్‌ అదిరిపోయిందన్నారు. 
 

38

ఆ తర్వాత ప్రియమణి(Priyamani) స్పందిస్తూ, ఒక బాధ ఉండిపోయింది. అల్లు అర్జున్‌తో వర్క్ చేయలేకపోయాననే ఫీలింగ్‌ ఉండిపోయింది` అని తెలిపింది ప్రియమణి. దీనికి బన్నీ స్పందించారు. `వర్క్ చేయలేదని అనుకోవద్దు.. ఇప్పటికీ ఛాన్స్ ఉంది. ఎప్పటికైనా చేయొచ్చు` అని తెలిపారు. 
 

48

అంతటితో ఆగలేదు.. దానికి కాస్త షుగర్‌ కోట్‌ యాడ్‌ చేశాడు బన్నీ. `పైగా ఇప్పుడు బాగా సన్నబడి బాగా హాట్‌గా తయారయ్యావు` అంటూ పులిహోర కలిపాడు. దీంతో ప్రియమణి ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. దీంతో ముద్దుగా రెండు చేతులు దగ్గరికి తీసుకుని తలకి మలుచుకుంది. ప్రేమతో వ్యక్తం చేసే ఫీలింగ్‌ అది. దీంతో `ఢీ` షో అందరి అరుపులు, ఈలలతో హోరెత్తిపోయింది. 

58

`ఢీ` షో ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఐకాన్‌ స్టార్‌, Priyamani మధ్య జరిగిన ఈ కన్వర్జేషన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ కావడమే కాదు, వైరల్‌ అవుతుంది. 

68

ఇక `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తుంది ప్రియమణి. గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా మరింత హాట్‌గా తయారైంది. ఈ షోకి సంబంధించి తాను దిగిన ఫోటోలను పంచుకుంది. గ్లామర్‌ బ్యూటీ అందాలు మరింత హాటెక్కిపోయాయని చెప్పిచ్చు. అందుకే బహుశా బన్నీ ఆ కామెంట్ చేశారు. 
 

78

హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియమణి అద్భుతమైన నటితో జాతీయ అవార్డుని కూడా దక్కించుకుంది. సినిమాల విషయంలో సెలక్టీవ్‌గా వెళ్తున్న ప్రియమణి ప్రస్తుతం `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తుంది. ఈ షోలో భాగంగా ఆమె మరింత గ్లామర్‌గా మారిపోయింది. ట్రెండీ వేర్ లో ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్లని ఫిదా చేస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

88

ప్రియమణి ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె నక్సలైట్‌గా కనిపించబోతుంది. మరోవైపు `సైనైడ్‌`తోపాటు తమిళంలో ఓ సినిమా, కన్నడలో మూడు సినిమాలు, హిందీలో `మైదాన్‌`లో నటిస్తుంది. 

also read: Deepika Pilli: బ్లాక్‌లో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. నెగటివ్‌ ప్రచారంతో షాకిస్తున్న నెటిజన్లు.. హాట్‌ టాపిక్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories