కొందరు నెటిజన్లు దీపికాకి టాలెంట్ లేదని కామెంట్లు చేయడంగమనార్హం. `దీపికాని సపోర్ట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం. ఆమెకి ఫ్యాన్స్, హేటర్స్ ఉన్నా,ఒక్క టాలెంట్ చెప్పండి. ఆమెలా డాన్సు చేసేవాళ్లు వేలల్లో ఉన్నారు. `ఢీ`లో సుడిగాలి సుధీర్, రష్మి లేకుండా వీరిని ఊహించుకోగలమా? వీడియోలు చేయడంలో తప్ప, ఆమెకి నో టాలెంట్ అని, ఆమెలా వీడియోలు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంకా బాగా చేయగలరు. సరిగ్గా డైలాగ్ చెప్పడం కూడా రాదు. ఏదో పాట ఏసుకుని అటూ ఇటు ఊగడం తప్ప ఏం వస్తుంది ఆమెకి. ఏం టాలెంట్ ఉందని సపోర్ట్ చేస్తారంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.