సినిమాల్లోకి రాకపోతే అనుష్క శెట్టి ఏమయ్యేదో తెలుసా? యోగా గురువు మాత్రం కాదు, పెద్దవాళ్లకి దూరం

Published : Jul 20, 2025, 08:18 AM IST

అనుష్క శెట్టి యోగా టీచర్‌ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ ఆమె హీరోయిన్‌ కాకపోతే ఆమె ఏం చేసేదో వెల్లడించింది.ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని పంచుకోవడం విశేషం. 

PREV
15
`ఘాటి`తో రాబోతున్న అనుష్క శెట్టి

స్వీటీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే అనుష్క శెట్టి ప్రస్తుతం ఓ భారీ యాక్షన్‌ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఆమె ఇప్పుడు `ఘాటి` అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఓటీటీ డీల్‌ కారణంగా రిలీజ్‌ డిలే అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ రానుంది.

25
బయట కనిపించని అనుష్క.. కారణం ఏంటంటే?

చాలా రోజులుగా అనుష్క శెట్టి పబ్లిక్‌ లోకి రావడం లేదు. ఆమె కేవలం సినిమా షూటింగ్‌ల్లోనే పాల్గొంటుంది. లేదంటే ఇంట్లో ఉంటుంది. ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లలోగానీ, మీడియా ముందుకు గానీ రావడం లేదు, దీంతో అనేక పుకార్లు వస్తున్నాయి. 

అనుష్క అనారోగ్య సమస్యలతో బాధపడుతుందనే రూమర్లు వ్యాప్తిస్తున్నాయి. అయితే అనుష్క అధిక బరువు సమస్యతో బాధపడుతుందని, అందుకే ఆమె బయటకు రావడం లేదని సమాచారం. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.

35
అనుష్క సినిమాల్లోకి రాకపోయి ఉంటే

ఇదిలా ఉంటే అనుష్కకి సంబంధించిన ఆసక్తికర విషయం లీక్‌ అయ్యింది. అనుష్క సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యేది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా చేసింది.

దీంతో అదే కంటిన్యూ అయ్యేదనేదనే డౌట్‌ రావచ్చు. కానీ ఆమె అనుకున్నది మరోటి ఉంది. టీచర్‌ కావాలనుకుందట. అకాడమిక్‌కి సంబంధించిన టీచర్‌ కావాలని ఉందట. అయితే పెద్ద స్టూడెంట్స్ కి కాదు, చిన్న పిల్లలకు చదువు చెబుతానని చెప్పింది. 

45
సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా అనుష్క

ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అనుష్క చెప్పిన సమాధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బెంగుళూరుకి చెందిన అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గానే చేసేది. 

అలా యోగా క్లాసుల్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. అనుష్కని చూసి నాగార్జునకి చెప్పారు. ఇద్దరు కలిసి ఆమెని సినిమాల్లోకి తీసుకొచ్చారు. `సూపర్‌` సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా పరిచయం చేశారు.

55
బిగ్‌ స్టార్స్ అందరితో రొమాన్స్ చేసిన అనుష్క

టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్స్ తో కలిసి నటించింది అనుష్క. నాగార్జునతోపాటు బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, మహేష్‌, గోపీచంద్‌, రవితేజ, మంచు విష్ణు వంటి వారితో కలిసి నటించింది.

 చిరంజీవితోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. `ఘాటి` మూవీతోపాటు మలయాళంలో ఓ సినిమా చేస్తోంది అనుష్క.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories