ఎమ్మెల్యే మేడం ఎంత అందంగా ఉందో కదా.. కేథరిన్ నిండైన చీరకట్టు సొగసుకి ఫిదా అవుతున్న నెటిజన్లు

Published : Oct 08, 2022, 08:48 PM IST

చూడగానే మాయలో పడిపోయే సోయగాలు కేథరిన్ సొంతం. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

PREV
18
ఎమ్మెల్యే మేడం ఎంత అందంగా ఉందో కదా.. కేథరిన్ నిండైన చీరకట్టు సొగసుకి ఫిదా అవుతున్న నెటిజన్లు

చూడగానే మాయలో పడిపోయే సోయగాలు కేథరిన్ సొంతం. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

28

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ మూవీలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ కేథరిన్ కూడా డాన్స్ తో అదరగొట్టింది. 

38

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాడనికి కారణం ఇదే. మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు జోష్ తెచ్చింది అని చెప్పొచ్చు. 

48

ఆ చిత్రంలో లేడీ ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ మెస్మరైజ్ చేసింది. అప్పటి నుంచి కేథరిన్ ని ఫ్యాన్స్ ముద్దుగా ఎమ్మెల్యే మేడం అంటూ పిలుస్తున్నారు. కేథరిన్ అందరి హీరోయిన్ల లాగా నాజూకు గ్లామర్ మైంటైన్ చేయదు. బొద్దుగా ఉంటూనే యువతని ఆకర్షిస్తోంది. 

58

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

68

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. అతిగా ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

78

తాజాగా కేథరిన్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ షేర్ చేసింది. నిండైన చీరలో కేథరిన్ కళ్లుచెదిరే విధంగా ధగధగ మెరుపులతో మెరిసిపోతోంది. పట్టుచీరలో ఎమ్మెల్యే మేడం ఎంతో అందంగా హుందాగా ఉందని నెటిజన్లు అంటున్నారు. 

88

కేథరిన్ చివరగా మాచర్ల నియోజకవర్గం, బింబిసారా చిత్రాల్లో నటించింది. మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కాగా.. బింబిసారా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల కేథరిన్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ వస్తున్నాయి. 

 

click me!

Recommended Stories