అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చింది.చైతు, సాయి పల్లవి లవ్ సీన్స్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే లాంగ్ రన్ లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ చిత్రం 80 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించబడింది. చందూ ముండేటి దర్శకత్వంలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపించారు.