అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో నటించి కావ్య గుర్తుందా..? ఇలా చెపితే గుర్తు రాకపోవచ్చు. కానీ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట పాటలో కనిపించిన చిన్నారి గుర్తుందా అంటే మాత్రం టక్కున ఆ ముఖం గుర్తు వస్తుంది. 17 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన గంగోత్రి సినిమాల్లో చిన్నారి గా కనిపించిన కావ్య ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అందాల భామగా మారిన కావ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.