అల్లు అర్జున్‌ రీమేక్‌ చేయాలనుకున్న ఏకైక చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? ప్రతి డైలాగ్‌ దించేశాడు

Published : Oct 20, 2025, 10:45 AM IST

చిరంజీవి నటించిన చిత్రాల్లో తనకు ఇష్టమైన మూవీ ఏంటో తెలిపారు అల్లు అర్జున్‌. అంతేకాదు ఆ మూవీలోని ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్‌, ప్రతి డైలాగ్‌ చెప్పి ఆశ్చర్యపరిచారు. 

PREV
15
అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ

చిరంజీవి నటించిన `విజేత`, `డాడీ` చిత్రాల్లో బాలనటుడిగా మెరిసిన అల్లు అర్జున్‌ ఆ తర్వాత `గంగోత్రి` మూవీతో హీరోగా మారి ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తోన్న విషయం తెలిసిందే. ఐకాన్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. `పుష్ప 2`తో ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవి మూవీస్‌లో తనకు నచ్చిన చిత్రం ఏంటో తెలిపారు. అంతేకాదు తాను రీమేక్‌ చేయాలనుకున్న చిరు మూవీ గురించి వెల్లడించారు.

25
`రౌడీ అల్లుడు`ని రీమేక్‌ చేయాలనుకున్న అల్లు అర్జున్‌

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో తనకు ఇష్టమైన మూవీ `రౌడీ అల్లుడు` అని తెలిపారు అల్లు అర్జున్‌. ఆ సినిమాలో చిరంజీవి గారి పీక్‌ లెవల్‌ చూస్తారని, కామెడీ వేరే లెవల్‌ అని తెలిపారు. నటుడిగా ఆయన బౌండరీస్‌ బ్రేక్‌ చేసి నటించిన చిత్రమని, అత్యధికంగా తాను చూసి మూవీ అని, అందులో చిరంజీవిగారి బాడీలాంగ్వేజ్‌ని పీక్‌లో చూస్తారని తెలిపారు. `రౌడీ అల్లుడు` తన ఫేవరేట్ మూవీ అని, రీమేక్‌ చేయాల్సి వస్తే ఈ సినిమాని రీమేక్‌ చేస్తానని తెలిపారు బన్నీ. సినిమా ప్రారంభం సీన్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌, ప్రతి డైలాగ్‌ చెప్పేయగలను అని తెలిపారు.

35
చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ పీక్‌లో ఉంటుందన్న బన్నీ

అంతేకాదు అందులోని డైలాగ్స్ కూడా చెప్పారు. `నీచ్‌ కమినే కుత్తే, ఆటో జానీకో, కామ్‌ ఔరేకే బాత్‌.. అంటూ వరుసగా డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇందులో చిరంజీవి కామెడీ చాలా ఇష్టమని తెలిపారు బన్నీ. రాఘవేంద్రరావు మొదటిసారి మాట్లాడుతూ నిర్వహించిన `సౌందర్యలహరి` టాక్‌ షోలో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. `గంగోత్రి`తో అల్లు అర్జున్‌ని హీరోగా రాఘవేంద్రరావు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ విశేషాలను ఇందులో మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీతోపాటు నిర్మాత దిల్‌ రాజు, కెమెరామెన్‌ ఛోటా కె ప్రసాద్‌ పాల్గొన్నారు. ఇందులో బన్నీ `రౌడీ అల్లుడు` మూవీపై తన ఇష్టాన్ని పంచుకోవడం విశేషం.

45
రౌడీ అల్లుడులోని చిరంజీవిని ఆవిష్కరించబోతున్న అనిల్‌ రావిపూడి

చిరంజీవి నటించిన `రౌడీ అల్లుడు` మూవీకి రాఘవేంద్రరావు దర్శకుడు. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేశారు. శోభన, దివ్య భరతి హీరోయిన్లుగా నటించారు. కోట శ్రీనివాసరావు విలన్‌. అల్లు అరవింద్‌ నిర్మించారు. 1991, అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదలైంది. ఇటీవలే 34ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చాలా సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఈ మూవీ చిరంజీవిని మాస్‌ హీరోగా పీక్‌ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇందులో చిరు కామెడీ, డైలాగ్‌ డెలివరీ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో `రౌడీ అల్లుడు` రిఫరెన్స్ నే ఉపయోగిస్తున్నారట.  వింటేజ్‌ చిరుని చూపించబోతున్నట్టు ఇప్పటికే అనిల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ స్టయిల్‌లో కామెడీ, యాక్షన్‌, చిరు బాడీ లాంగ్వేజ్‌ని మరోసారి ఆవిష్కరించబోతున్నారట.

55
ఏఏ 22 తో అంతర్జాతీ మూవీ చేస్తోన్న బన్నీ

ఇక అల్లు అర్జున్‌ `గంగోత్రి`తో హీరోగా పరిచయమై `ఆర్య`తో బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకున్నారు. హీరోగా పెద్ద బ్రేక్‌ అందుకున్నారు. ఆ తర్వాత `బన్నీ`, `దేశముదురు`, `రేసుగుర్రం`, `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతో విజయాలు సాధించారు. స్టార్‌ హీరో నుంచి సూపర్‌ స్టార్‌గా, స్టయిలీష్‌ స్టార్‌గా, ఐకాన్‌ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఏఏ22 మూవీలో నటిస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో మరో నలుగురు హీరోయిన్ల కనిపించబోతున్నారని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories