అవును పోలీస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ కు హీరోయిజం తోడైతే అది అద్భుతమే అవుతుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు పోలీస్ పాత్రల్లో ఎంత పవర్ ఫుల్ గా కనిపించారో అందరికి తెలిసిందే. అలాగే బన్నీ కూడా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించాలి అనుకుంటున్నాడట. ఆ కోరికతోనే రేసుగుర్రం సినిమాలో వన్ డే పోలీస్ గా దడదడలాడించాడు అల్లు అర్జున్. ఆ యూనిఫామ్ లోకూడా చాలా గ్లామర్ గా కనిపించాడు. ఇక ఫుల్ లెన్త్ పోలీస్ పాత్రలో కనిపించడం కోసం ఎదురుచూస్తున్నాడట బన్నీ.