లంగా ఓణీలో `క్రాక్‌` పుట్టిస్తూ జయమ్మ హోయలు.. వరలక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు హల్‌చల్‌

First Published | Mar 26, 2021, 12:57 PM IST

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ వెండితెరపై రెబల్‌ యాక్షన్‌ని చూపించి తనదైన ముద్ర వేసుకుంది. కానీ రియల్‌ లైఫ్‌లో ట్రెడిషనల్‌ అమ్మాయిగా కనువిందు చేస్తుంది. తాజాగా లంగా ఓణీలో హోయలు పోయింది. సోదరుడి మ్యారేజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తన సోదరుడి మ్యారేజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా లంగాఓణీలో మెరిసింది వరలక్ష్మి.
ట్రెండ్రీవేర్‌లో కేకపెట్టించే వరలక్ష్మీ తాజాగా హాఫ్‌శారీలో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా పంచుకున్న వరలక్ష్మీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హాఫ్‌ శారీలో తెగ ఆకట్టుకుంటుందీ భామ. హాఫ్‌ శారీలోనూ బోల్డ్ గా, స్టన్నింగ్‌గా ఉన్నావంటూ కామెంట్‌ చేస్తున్నారు.
వరలక్ష్మీ అంటే తెలుగు ఆడియెన్స్ కి `జయమ్మ` పేరే గుర్తొస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆమె జయమ్మగానే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. `క్రాక్‌` చిత్రంలో జయమ్మ పాత్రలో వరలక్ష్మీ మెస్మరైజ్‌ చేసింది.
మరోవైపు `నాంది` చిత్రంలోనూ ఆధ్యగా లాయర్‌ పాత్రలో ఒదిగిపోయింది. సినిమాని తన భుజాలపై ముందుకు నడిపించింది. విజయంలో ప్రధాన క్రెడిట్‌ కొట్టేసింది.
హీరోయిన్‌గా కాకుండా ప్రత్యేక పాత్రలకు, నెగటివ్‌ రోల్స్ కి వరలక్ష్మీ యాప్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ ఎనిమిది సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో ఓ మలయాళం, ఓ కన్నడ చిత్రం ఉండగా, మిగిలినవన్నీ తమిళ సినిమాలు కావడం విశేషం.

Latest Videos

click me!