సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై స్పందించడం కంటే, ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని, మీకు నచ్చిన పని చేయాలని, నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి, పర్లేదు, కనీసం నువ్వు అయినా ఆ టైమ్ ని ఎంజాయ్ చేస్తావని తెలిపారు అల్లు అర్జున్. ఎవరినీ ఎప్పుడూ ట్రోల్ చేయోద్దని చెప్పాడు. టైమ్ గానీ, ఎనర్జీ గానీ, ఏదైనా అనుకోండి, ప్రతి మనిషి ఒక రోజులో వంద శాతం ఉందనుకుంటే, దాన్ని మీరు దేనికి వాడతారనేది ముఖ్యం. ఆ ఎనర్జీని సరైన దానికి ఉపయోగించుకోండి అని చెప్పాడు బన్నీ. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.