బాలీవుడ్ ఇప్పుడు తారలకు ఓ గ్లామర్ ప్రపంచం. వాళ్ల సక్సెస్, రిచ్ లైఫ్‌స్టైల్‌కి కారణం వాళ్లు తీసుకునే రెమ్యూనరేషనే. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎంత సంపాదిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?
వెండితెరపై మీరు చూసి ఆనందించే బాలీవుడ్ తారలు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. తమ నటనకు వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వాళ్ల పే చెక్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి!
26
దీపికా పదుకొణె
దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఈమె ఒక్కో సినిమాకు సుమారు 30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా దీపికా డిమాండ్ చాలా ఉంది. ముఖ్యంగా కల్కీ లాంటి సినిమాలతో ఆమె హవా పెరిగిపోతోంది. పెళ్లై పిల్లలు ఉండి, 40 ఏళ్లు దాటినా.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది దీపికా.
36
రణ్‌బీర్ కపూర్
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న రణ్‌బీర్, ఒక్కో సినిమాకు రూ. 60 నుంచి 75 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్. లవర్ బాయ్ గా లేడీ ఫాలోయింగ్ సాధించిన ఈ హీరో. ఈమధ్య కాలంలో కాస్త సీరియస్ లైన్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ తో పాటు సౌత్ లోను మంచి ఫాలోయింగ్ ఉంది ఈ హ్యాండ్సమ్ హీరోకి.
కింగ్ ఖాన్ షారుఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 60 ఏళ్ల కుర్రాడు. ఈ ఏజ్ లో కూడా సిక్స్ ప్యాక్ తో, హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 250 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తారట. అయితే షారుక్ సినిమాలు కూడా ఈమధ్య కాలంలో 1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి.
56
ఆలియా భట్
ఆలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 20 నుంచి 25 కోట్లు తీసుకుంటుంది. దీంతో హిందీ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణులలో ఈమె కూడా ఒకరిగా నిలిచింది. సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా ఏలుతుంది ఈ నటి. పెళ్లే పాప పుట్టినా కానీ.. ఆమె ఫాలోయింగ్, సినిమా అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు.
66
ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఈమె కూడా భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక రకంగా టాప్ ప్లేస్ లో ప్రియాంకనే ఉంది. చాలా కాలంగా బాలీవుడ్ కు దూరమై.. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ హీరోయిన్.. తెలుగు నుంచి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న వారణాసి లో మహేష్ బాబు జోడీగా నటిస్తోంది.