300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో విజయ్ దళపతిని దాటేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

Published : Sep 04, 2025, 08:22 PM IST

తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్నారు. వందల కోట్ల రెమ్యునరేషన్ తో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఓ హీరో 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో విజయ్ దళపతి లాంటి హీరోలను దాటేశాడు. ఇంతకీ ఎవరా హీరో?

PREV
15

మారిపోయిన రెమ్యునరేషన్ ట్రెండ్ 

కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీలో పారితోషికాల ట్రెండ్ బాగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా దక్షిణాది నటులు రెమ్యుూనరేషన్ విషయంలో ముందున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు విజయ్, రజినీకాంత్ లాంటి వారు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ లిస్టులో కొత్తగా టాలీవుడ్ స్టార్ హీరో చేరడంతో పాటు వాళ్లను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

25

విజయ్, రజినీకాంత్ రెమ్యునరేషన్ 

ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటి వరకు తమిళ స్టార్ విజయ్ అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు. ఆయన నటిస్తున్న చివరి సినిమా జననాయకన్ (Thalapathy 69) కోసం విజయ్ రూ. 275 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు సమాచారం. అంతకుముందు ఆయన ‘కోడ్’ సినిమాకి రూ. 250 కోట్లు, అలాగే రజినీకాంత్ ‘కూలీ’ సినిమాకు. 200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

35

300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ 

అయితే, విజయ్‌ని ఇప్పుడు అల్లు అర్జున్ అధిగమించారు. 'పుష్ప: ది రూల్' (Pushpa 2: The Rule) సినిమా కోసం అల్లు అర్జున్ 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో ఒక నటుడికి అందించిన అత్యధిక పారితోషికం కావడం విశేషం.

45

పుష్ప 2తో తిరుగులేని ఇమేజ్ 

పుష్ప 2' సినిమా వరల్డ్ వైడ్‌గా 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాహుబలి రికార్డ్స్ ను కూడా దాటేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌లోనే 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ విజయం నేపథ్యంలో బన్నీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది.

55

అట్లీతో అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా 

ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో కలిసి మరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి దాదాపు 800 కోట్ల బడ్జెట్ ఉండనుంది. ఈ సినిమాలో బన్నీకి 300 కోట్లకు పైగా పారితోషికం లభించే అవకాశముందని సమాచారం.దీంతో అల్లు అర్జున్, విజయ్‌ను అధిగమించి భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న నటుడిగా స్థిరపడ్డారు. పాన్ ఇండియా హిట్ తర్వాత బన్నీ రెమ్యునరేషన్ రేంజ్ ఇలా పెరగడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories