బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఉర్వశి రౌతేలా హిందీ సినిమాలతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకూ బాగా పరిచయం. ప్రత్యేకించి ఐటెమ్ సాంగ్స్ ద్వారా ఆమె టాలీవుడ్ ఆడియన్స్‌కి దగ్గరైంది. తన డాన్స్ మూవ్స్, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఉర్వశి తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
26
టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఐటెం సాంగ్స్ కి దర్శకులకు ఊర్వశి ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఐటెం సాంగ్స్ విషయంలో టాలీవుడ్ లో ఊర్వశిదే హవా అని చెప్పొచ్చు.
36
ఒక్క 2023 ఏడాదిలోనే ఊర్వశి రౌతేలా తెలుగులో ఏకంగా 4 చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో ఆమె చిందులు వేసింది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో ఊర్వశి చేసిన బాస్ పార్టీ అనే సాంగ్ యువతని బాగా మెప్పించింది.
స్కంద, ఏజెంట్, బ్రో చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసినప్పటికీ అవి నిరాశ పరిచాయి. చివరగా ఊర్వశి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలో దబిడిదిబిడి అనే సాంగ్ లో మెరుపులు మెరిపించింది. ఆ సాంగ్ లో డ్యాన్స్ వివాదాస్పదమైనప్పటికీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
56
డాకు మహారాజ్ లో 3 నిమిషాల సాంగ్ కి గాను ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే నిమిషానికి ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు లెక్క.
66
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ లో ఊర్వశి ఐటెం సాంగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో అని. అంతకు ముందు వరకు వాల్తేరు వీరయ్య, బ్రో లాంటి చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ కోసం 2 కోట్లు ఛార్జ్ చేసినట్లు ప్రచారం ఉంది.