సమంతను దూరం పెడుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..? ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేశారుగా..?

First Published | Jun 26, 2024, 11:30 AM IST

మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది హీరోయిన్ సమంత, వరుస అవకాశాలు వస్తుండగా.. కొన్ని మాత్రం చ్చినట్టు వచ్చి చేజారి పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు హీరోలు సమంతను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. 

సౌత్ సినిమాలో సమంత ఓ అద్భుతం. చాలా కష్టపడి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ సీనియర్ బ్యూటీ.. ఆతరువాత కెరీర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. పర్సనల్ లైఫ్, హెల్త్.. మూవీ కెరీర్ ఇలా అన్నిరకాలుగా ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఎక్కడా తగ్గకుండా.. ఆత్మ విశ్వాసంతో నిలబడింది బ్యూటీ. 
 

మోక్షజ్ఞ కు పోటీగా మరో స్టార్ హీరో వారసుడు... బాలయ్య కు తలనొప్పిగా మారిన వారసుడి ఎంట్రీ..?

తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సమంత..  నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. తన జీవితంలో అనుకోని కుదుపులకు లోనయ్యింది. ఇద్దరూ.. హ్యాపీగా లైఫ్ ను లీడ్  చేస్తున్నారు అనుకున్న టైమ్ లో.. సడెన్ గా విడాకులు ప్రకటించిన అందరిని ఆశ్చర్యపరిచారు స్టార్ కపుల్. దాంతో సమంత లైఫ్ ఒక్క సారిగా రివర్స్ అయిపోయింది. రకరకాల ఆలోచనలతో.. సమంత చాలా స్ట్రగుల్ ను ఫేస్ చేసింది. 

దీపికా, కరీనా.. ఆలియా తో పాటు ప్రెగ్నెంట్ గా ఉండి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇంకెవరంటే..?


Samantha

చాలా కాలానికి కోలుకుని బయట పడింది బ్యూటీ. తేరుకుని సినిమాలు చేస్తుంది అనుకున్న టైమ్ కు.. ఆమె అనారోగ్యంతో సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇన్ని చికాకుల మధ్య సమంత క్రేజ్ అమాంతం పడిపోయింది.  అయినా సరే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు సమంత. తన గ్లామర్ తో పాటు... ఫిట్ నెస్ కూడా ఏమాత్రం కోల్పోకుండా.. జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది బ్యూటీ. వరుసగా సినిమాలు చేస్తోంది.  

రామ్ చరణ్ కు ఆస్తి విషయంలో ఉపాసన షాక్..? మెగా కోడలి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే..?

విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన తరువాత కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకుంది సమంత. ఆతరువాత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టీవ్ అవుతోంది.  ఇండస్ట్రీలో పలు సందర్భాలలో సమంత పేరు మారుమ్రోగిపోయిన పెద్ద హీరోలు మాత్రం ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయారు. తాజాగా సమంత ఖాతాలో రెండు  బిగ్ బంపర్ ఆఫర్లు ఎగిరిపోయినట్టు తెలుస్తోంది.  ఇద్దరు హీరోలు ఆమెను దూరం పెట్టారని సమాచారం. అందులో ముఖ్యంగా  అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో హీరోయిన్ గా సమంతని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. 

త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?

ఆ షాక్ నుంచి తేరుకునేలోపు ఇప్పుడు సమంతకు మరో బిగ్ షాక్ తగిలిందట.  బాలీవుడ్ నుంచి తనకు వచ్చిన ఏకైక ఆఫర్ చేజారిపోయినట్టు సమాచారం.  బీ టౌన్ లో సమంతకు చాలా ఇష్టమైన ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్. ఆయన  సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినట్లు తెలుస్తుంది . బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి హీరోయిన్ సమంత డైహార్ట్ ఫ్యాన్. ఆయనతో సినిమా అని తెలియగానే ఎగిరి గంతేసిందట బ్యూటీ. కాని ఆతరువాత ఆ అవకాశం చేజారిపోయినట్టు తెలుస్తోంది. 

షారుఖ్ సినిమాలో సమంత హీరోయిన్ అని ప్రచారం మాత్రమే జరిగిందట. ఈ  రూమర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి కూడా.  కాని అది ఏమాత్రం నిజం కాదని... మేకర్స్ తేల్చేసినట్టు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారని .. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే నిజమైతే సమంత కెరీర్ బాలీవుడ్ లో పరుగులు పెట్టడం ఖాయం అని అనుకున్నారంతా.

అయితే ఈ విషయంలో నిజం లేదు..ఇదిరూమర్ మాత్రమే అని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో చాలా సినిమాల కోసం సమంతను ఆప్షన్ గా తసుకుని.. ఆతరువాత మరో హీరోయిన్ ను ఫైనల్ చేసుకుంటున్నారట మేకర్. ఇదంతా హీరోల నిర్ణయం వల్లే జరుగుతుంది అనేది టాక్. కాని ఇందులో ఎంత వరకూ నిజం ఉంది అనేదిమాతర్ం తెలియాల్సి ఉంది. మొత్తానికి హీరోలు సమంతను దూరం పెడుతున్నారన్నప్రచారం మాత్రంగట్టిగా జరుగుతోంది. 

Latest Videos

click me!