కరెక్ట్ గా పదేళ్ల పాటు హీరోయిన్‌గా రాణించింది రంభ. ఈ పదేళ్లలోనే ఇటు తెలుగు, అటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి నార్త్, సౌత్‌ని ఊపేసింది. తెలుగులో దాదాపు 40, తమిళంలో దాదాపు35, 17 హిందీలో, తొమ్మిది కన్నడ, తొమ్మిది మలయాళంలో, ఏడు ఇతర భాషల్లో చేసింది. ఇలా పదేళ్ల టైమ్ పీరియెడ్‌లోనే ఆమె ఏకంగా సుమారు 117 సినిమాలు చేసింది. ఇందులో ఐటెమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. యావరేజ్‌గా ఆమె ఏడాదికి 12 సినిమాలు చేసిందని చెప్పొచ్చు.