Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ

Published : Aug 20, 2026, 03:29 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీపై ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ కి పవన్ కళ్యాణ్ స్టిల్ ఒకటి అస్సలు నచ్చలేదట. దానిని తొలగించమని అడిగితే తాను ఏం చేశాను అనేది ఎస్ కె ఎన్ వివరించారు.

PREV
15
Pawan Kalyan

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబోలో జానీ, జల్సా లాంటి చిత్రాలు వచ్చాయి. జల్సా మాత్రమే సూపర్ హిట్ అయింది.

25
అల్లు శిరీష్ వల్లే ఇండస్ట్రీకి..

జల్సా మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. దీని గురించి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అల్లు శిరీష్ వల్లే. నేను సినిమాలకు సంబంధించి ఫ్యాన్ పేజీలు నడిపేవాడిని. నా ట్యాలెంట్ చూసి నువ్వు ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది అని శిరీష్ ప్రోత్సహించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చాను. అల్లు శిరీష్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లోనే నాకు పీఆర్వోగా అవకాశం ఇచ్చారు.

35
కాలు పైకెత్తే పోస్టర్

పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి పీఆర్వోగా పని చేశాను. ఆ సినిమాకి నేను, శిరీష్ కలసి పబ్లిసిటీ కోసం వర్క్ చేశాం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కాలు పైకి ఎత్తే పోస్టర్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. దానిని వైరల్ చేద్దాం అని అనుకున్నాం.

45
అల్లు అరవింద్ కి నచ్చలేదు

కానీ అల్లు అరవింద్ గారికి ఆ పోస్టర్ అస్సలు నచ్చలేదు. అలా కాలు ఎత్తడం చూడడానికే ఇబ్బందిగా ఉంది. దానిని తలగించండి అని చెప్పారు. నేను కలగజేసుకుని.. లేదు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి అని చెప్పా. ఆ విధంగా అల్లు అరవింద్ గారిని ఒప్పించి ఆ పోస్టర్ ని పెట్టాను. ఆ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఐకానిక్ స్టిల్స్ లో అది కూడా ఒకటి.

55
నిర్మాతగా ఎదిగిన ఎస్ కె ఎన్

సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీనితో నాకు అల్లు అరవింద్ గారి దగ్గర, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ విధంగా నేను పిఆర్ గా కెరీర్ ప్రారంభించాను అని ఎస్ కె ఎన్ తెలిపారు. ఇప్పుడు ఎస్ కె ఎన్ టాలీవుడ్ లో క్రేజీ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి హిట్ చిత్రాలని నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories