మహేష్, పవన్ లతో సినిమా తీసిన నిర్మాత అరెస్టు, రూ.8,300 కోట్ల ఆక్రమణ కేసు

First Published | Oct 24, 2024, 6:46 AM IST

టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Mahesh, venkatesh, Siva Rama Krishna, Arrest


 టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ అయ్యాడు.. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించిన కేసులో అరెస్ట్ అయ్యారని తెలుస్తోంది. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. 

Mahesh, venkatesh, Siva Rama Krishna, Arrest


 అనంతరం ఆ ల్యాండ్‌ తనదేనంటూ క్లయిమ్ చేసిన శివరామకృష్ణ బిల్డర్‌ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్‌లో పాగా వేసే ప్రయత్నం చేసారు. శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు, కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది.

ఇక సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను అరెస్ట్‌ చేశారు.  ప్రస్తుతం అక్కడ భూమి ధర ఎకరం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన రూ.8,300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. 


Mahesh, venkatesh, Siva Rama Krishna, Arrest


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్‌ 46లో 83 ఎకరాల భూమిని సినీ నిర్మాత శివరామకృష్ణ కబ్జా చేశారని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జరీనా పర్వీన్‌ ఈ ఏడాది ఆగస్టులో సీసీఎ్‌సలో ఫిర్యాదు చేశారు.

దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. భూ కబ్జా కేసు కావడంతో దానిని ఓయూ పీఎ్‌సకు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఓయూ పోలీసులు నిందితులను ఈ నెల 17న అరెస్టు చేశారు. 

Mahesh, venkatesh, Siva Rama Krishna, Arrest


కాగా, ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌లో బహమనీ, దక్కన్‌ రాజవంశాలతోపాటు.. కుతుబ్‌షాహీ, ఆదిలా షాహీ, షాజహాన్‌ చక్రవర్తి కాలం నుంచి మెఘలులు, అసఫ్‌ జాహీల వరకు దాదాపు 43 మిలియన్ల విలువైన రికార్డులను కలిగి ఉంది. రికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో రాయదుర్గంలోని 83 ఎకరాలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో 10 ఎకరాల భూమికి సంబంధించిన పహాణీ, సేత్వార్‌లు కనిపించకుండా పోయాయి. ఈ భూములను సినీ నిర్మాత శివరామృష్ణ కబ్జా చేసినట్లు గుర్తించారు.


ఇక నిర్మాతగా బూరుగుపల్లి శివరామకృష్ణ అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. రవితేజతో దరువు సినిమా సహా యువత, రైడ్ ఏమో గుర్రం ఎగరావచ్చు వంటి సినిమాలను ఆయన నిర్మించారు. సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన అందరి బంధువయ, మహేష్ బాబుతో యువరాజు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 

Latest Videos

click me!